Teja Sajja: రూ.5000తో కెరియర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జ.. హనుమాన్ మూవీకి ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలుసా?
తేజ సజ్జా హీరోగా వస్తున్న తాజా చిత్రం హనుమాన్. అయితే ఈ కుర్ర హీరో.. తొలుత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమా చూడాలని ఉందిలో మాటలు రాని అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. అలా సినీ ప్రయాణం మొదలు పెట్టిన తేజ సజ్జా.. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు తేజ సజ్జా షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
చెల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. చూడాలని ఉంది అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తేజ. అందులో చిరంజీవికి కొడుకుగా కనిపించి మెప్పించాడు. మొదటి సినిమాతోనే ఈ కుర్రాడు ఎవరు అని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమాలో ఈ కుర్రాడి పాత్ర బాగానే ఉంటుంది.

అయితే ఈ సినిమా కోసం రూ.5వేలు అందుకున్నట్లు సమాచారం. అయితే 5వేలతో కెరియర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జా... ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలని ఉంది సినిమా తర్వాత తేజ సజ్జా.. మహేశ్ బాబు రాజకుమారుడు చిత్రంలో నటించాడు. మహేశ్ బాబు నటించిన యువరాజు చిత్రంలో నటించిన తేజ.. ఇప్పుడు మహేశ్ కు పోటీగా రావడం చర్చనీయాంశం అయింది.
తేజ సజ్జా ఆ తర్వాత కలిసుందాం రా, బాచి, దీవించండి, ప్రేమ సందడి, ఇంద్రుడు, గంగోత్రి, ఒట్టేసి చెబుతున్నా, వసంతం, యువకుడు, అశోక్, ప్రియమైన నీకు, యువకుడు, అశోక్, అడవి రాముడు, చిన్నా, బాలు, నా అల్లుడు, అందరివాడు, చత్రపతి, శ్రీరామదాసు, అస్త్రం, బాస్ వంటి సినిమాల్లో నటించాడు. ఆ మధ్య పెద్దగా అయ్యాక ఓ బేబీ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు.

ఇక హీరోగా తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిినిమా సూపర్ సక్సెస్ ఇచ్చింది ఈ కుర్ర హీరోకు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు.. ప్రస్తుతం హను-మాన్ అనే చిత్రంలో తేజ నటించి.. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్షనల్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.
అయితే ఈ సినిమా కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు కోటి రూపాయలకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హను-మాన్ చిత్రం కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగానే డిమాండ్ చేశాడట. 5వేల రూపాయలతో కెరియర్ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇప్పుడు కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











