Varun Tej : రామ్ చరణ్ - పవన్ కల్యాణ్ కలిసి నన్ను చాలా బాధపెట్టారు - ఒంటరోడిని చేశారు!
మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నాగబాబు కుమారుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. ఇక ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వరుణ్ తేజ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. వారు ఇద్దరు కలిసి తనను బాధపెట్టినట్లు చెప్పుకువచ్చాడు. అంతలా ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసి తెలుసుకుందాం.
ప్రయోగాత్మక చిత్రాలతో : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన వరుణ్.. ఆ తర్వాత ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేశారు. కంచె, గద్దల కొండ గణేశ్, మొన్నటి ఆపరేషన్ వాలంటైన్ వరకు చాలా సినిమాలు ప్రయోగత్మకమే. ఇక వరుణ్ తేజ్ గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తను ప్రేమించిన అమ్మాయి హీరోయిన్ లావణ్యతో ఏడడుగులు వేసి.. ఒక్కటయ్యారు. ఇక ప్రస్తుతానికి పలుసినిమాలో బిజీగా ఉంటూనే మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు వరుణ్.

మట్కాతో బిజీ : ప్రస్తుతానికి వరుణ్ తేజ్ మట్కా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తోంది. ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఎందుకో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. అప్పటికే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా ఇదే కోవలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కూడా ఆపరేషన్ వాలంటైన్ మీద పడింది.
సోషల్ మీడియాలో వైరల్ : ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ గురించి మాట్లాడిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఓ టీమ్ అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి వరుణ్ తేజ్ ను బాధపెట్టారట. అంతలా ఏం జరిగిందో వరుణ్ తేజ్ తన మాటల్లోనే చెప్పుకువచ్చాడు. ఓ ఫన్నీ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు.

పవన్-చరణ్ కలిసి : ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. ''మెగా ఫ్యామిలీ విషయాన్ని బయటపెట్టారు. నా చిన్నప్పుడు... కల్యాణ్ బాబాయి పెప్సీ యాడ్ చేసేవారు.. అదే చిరంజీవి గారు థంబ్స్ అప్ యాడ్ చేసేవారు. సేమ్ టైమ్ లో టీవీలో యాడ్స్ వచ్చేవి. నేను చిరంజీవి గారి సైడ్ ఉండేవాడిని. చరణ్ అన్న మాత్రం పవన్ కల్యాణ్ బాబాయి వైపు ఉండేవాడు. నేను చరణ్ కలిసి ట్రోల్ చేసుకునేవాళ్లం. థంబ్స్ అప్ తాగే వాళ్లు గ్రోయింగ్ మెన్ అనేది ఏదో ఉండేది.. అలా ట్రోల్ చేసుకునేవాళ్లం''మని తెలిపాడు.
రామ్ చరణ్ - అల్లు అర్జున్ మల్టీస్టారర్‌కు టైటిల్ రెడీ.. మూవీ అనౌన్స్ చేసిన అల్లు అరవింద్!
''సరే చిరంజీవి గారు ఉన్నంత వరకు ఫుల్ ప్రొటెక్షన్ ఉండేది. కానీ ఆయన షూటింగ్ వెళ్లిపోతే మాత్రం పవన్ బాబాయి, చరణ్ కలిసి నన్ను బాగా ఆటడేసుకునేవాళ్లు. ఇద్దరు కలిసి రూమ్ లో వేసి లాక్ చేసి.. లైట్స్ ఆఫ్ చేసి.. ఏడిపించేవాళ్లు. నన్ను చాలా భయపెట్టేవాళ్లు.. పెరిగెటప్పుడు రామ్ చరణ్ పవన్ కల్యాణ్ ఓ టీమ్ లాగా పెరిగారు. ఇదంతా ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుందని'' వరుణ్ తేజ్ చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











