బాలీవుడ్ టాప్ స్టార్స్‌ను బీట్ చేసిన ప్రభాస్, మహేశ్, బన్నీ.. ఆ ఒక్కడిని తప్ప!
ఒకప్పుడు టాలీవుడ్ అంటే నార్త్ ప్రేక్షకులు చాలా తక్కువగా చూసేవారు. సౌత్ సినిమాలు అంటే రొటిన్ ఫైట్స్, పాటలు, లాజిక్ లెస్ అంటూ కామెంట్స్ చేసేవారు. ఇక బహుబలి సిరీసుతో వాటన్నింటికి రాజమౌళి చెక్ పెట్టేశాడు. టాలీవుడ్ పేరు ఇప్పుడు దేశ విదేశాల్లో వినిపిస్తుంది. ఇక్కడి స్టార్స్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు. అయితే తాజాగా మన తెలుగు హీరోలు.. బాలీవుడ్ టాప్ స్టార్స్ ను బీట్ చేశారు. కానీ ఆ ఒక్క హీరోను బీట్ చేయలేకపోయారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సంస్థ సీని ప్రముఖుల గురించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో టాప్ హీరో ఎవరు అనేదానిపై ఆర్మాక్స్ సర్వే నిర్వహించి.. ఆ లిస్టును సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇండియాలో టాప్ 10 హీరోల జాబితాలో టాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. అయితే వారిలో ప్రభాస్, మహేష్ బాబు, అ్లలు అర్జున్ ముందంజలో ఉండగా.. ఆ ఒక్క బాలీవుడ్ స్టార్ హీరోను బీట్ చేయలేకపోయారు.

ఆర్మాక్స్ రిలీజ్ చేసిన ఇండియాలో టాప్ 10 హీరోల్లో పదవ స్థానాన్ని మన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఆయన ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే చరణ్ కు పదవ స్థానం రావడం కాస్త షాకింగ్ అనిపిస్తుంది. ఇక ఆయన ముందు స్థానం అనగా 9వ స్థానంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిలిచాడు. ఆయన ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ఇక 8వ స్థానంలో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నిలిచాడు. ఇటీవల ఫైటర్ సినిమాతో ప్రేక్షకులను హృతిక్ అలరించాడు. ఇక 7వ స్థానంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నిలిచాడు. ఈ హీరో సైతం ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక 6వ స్థానంలో మన టాలీవుడ్ హీరో యంగ్ లయన్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక 5వ స్థానంలో అల్లు అర్జున్ నిలిచాడు. ఈ హీరో పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. ఇక 4వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు. ఒక్క పాన్ ఇండియా చిత్రం తీయకపోయిన మహేష్ క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవెల్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీలో మహేష్ నటించనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచాలను నెలకొల్పుతుంది.
Samantha : 'సమంత అలాంటి వ్యక్తి - ఆమెను చూడగానే వణికిపోయా'
ఇక మూడవ స్థానంలో ఇళయదళపతి విజయ్ నిలిచాడు. ప్రస్తుతం గోట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక రెండో స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. సలార్ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం కల్కి 2898 ఏడి చిత్రం, రాజా డిలాక్స్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మన టాలీవుడ్ స్టార్స్ ఇంత మంది ఈ లిస్టులో చోటుసాధించుకున్నప్పటికీ ఆ ఒక్క స్టార్ ను బీట్ చేయలేకపోయారు. ఆయనే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్. ఈ హీరో ఇండియాలో టాప్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇవండీ ఇండియాలో టాప్ 10 హీరోల జాబితా.


Click it and Unblock the Notifications











