ఆ కథ విజయ్ దేవరకొండకు నచ్చలేదా!
విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో గత ఏడాది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంలో అద్భుత నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ గత ఏడాది రెండు సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు. అందులో గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు ఉన్నాయి. గీత గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. టాక్సీవాలా ఎలాంటి అంచనాలు లేకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాలు చేసేందుకు స్టార్ దర్శకులంతా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండని కాకినాడలో కలసి కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ పూరి జగన్నాథ్ సడెన్ గా హీరో రామ్ తో సినిమా ప్రారంభించేశాడు. దీని గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ సిద్ధం చేసిన కథ విజయ్ దేవరకొండకు నచ్చిందట. కానీ తనకు అభిమానుల్లో పెరిగిన అంచనాల నేపథ్యంలో ఈ కథ సరికాదని భావించాడట.

దీనితో పూరి జగన్నాథ్ హీరో రామ్ తో అదే కథని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ఖరారు చేశారు. పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. విజయ్ కోసం పూరి జగన్నాథ్ సిద్ధం చేసిన కథ ఇస్మార్ట్ శంకర్ కాదని, వీరిద్దరి కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











