Prabhas ఫ్లైట్‌లో సీక్రెట్‌గా ఆ అమ్మాయితో ప్రభాస్... ఆ పని చేస్తూ అడ్డంగా బుక్! ఈ పిక్ చూశారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి ఏడి 2898 చిత్రంతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంతోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఓ అమ్మాయితో ఫ్లైట్లో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో చూసేద్దాం.
Brahmamudi March 7th మళ్లీ ఆ పని మొదలెట్టిన స్వప్న... ఇంట్లో వాళ్లంతా షాక్.. అనామికకు రాజ్ వార్నింగ్!
జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇక ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలే తీస్తున్నాడు. బహుబలి సిరీస్ తర్వాత సాహో, రాదేశ్యాం, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటించాడు. అయితే అవి ఏవి అంతగా ప్రభాస్ రేంజుకు తగ్గట్లు ఆడలేదు. రాదేశ్యాం, ఆదిపురుష్ సినిమా కోట్లలో నష్టాన్ని మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సలార్ చిత్రం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చిందనే చెప్పాలి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకమారన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు మంచి హిట్ లభించింది. ఇక ఇదే జోష్ లో ప్రభాస్ తన తదుపరి సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దానితో పాటు ప్రభాస్... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి ఏడి 2898 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉందనే విషయం తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చాన్, లోక నాయకుడు కమల్ హాసన్, నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్, దీపిక పదుకునే, దిశా పటానీ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.

వీరితో పాటుగా ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్ఎస్ రాజమౌళి వంటి వారు కూడా నటిస్తున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాను వైజయంతి బ్యానర్ కు అచ్చొచ్చిన డేట్ మే 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ బ్యానర్ లో వచ్చిన చాలా సినిమాలు మే 9 రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక అదే ఫార్ములాను కల్కికి కూడా వాడుతున్నారు. 500 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచాలు అయితే నెలకొన్నాయి.

అయితే ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్లైట్లో ఓ అమ్మాయితో కనిపించాడు. అది కూడా ఆ ఫ్లైట్లో ఎవరు లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు.. కల్కి హీరోయిన్ దిశా పటానీ. ఈ భామ ప్రభాస్ తో కలిసి ఫ్లైట్లో జర్నీ చేసింది. అయితే ప్రభాస్ ను ఫోటో తీస్తున్నట్లు మరో ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్.. ప్రభాస్ సీక్రెట్ గా ఓ అమ్మాయితో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఆ ఫోటోపై లుక్ వేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











