విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్న రౌడీ స్టార్.!

By Manoj

తెలుగు సినిమాల్లోకి వచ్చిన కొద్ది రోజులకే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు క్రేజ్‌ను దక్కించుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ కుర్రాడు.. 'అర్జున్ రెడ్డి'తో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'గీత గోవిందం', 'ట్యాక్సీవాలా' వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే, కొద్ది రోజులుగా విజయ్ కెరీర్ కుదుపులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో రౌడీ స్టార్ ఓ సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నాడట. ఇంతకీ ఏంటా నిర్ణయం.? ఆ సంగతులేంటో చూద్దాం.!

వరుస దెబ్బలతో సతమతమవుతున్నాడు

వరుస దెబ్బలతో సతమతమవుతున్నాడు

విజయ్ దేవరకొండ ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. కెరీర్ ఆరంభంలో హిట్లు కొట్టినా.. గత ఏడాది వచ్చిన ‘డియర్ కామ్రేడ్'తో పాటు ఇటీవల విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ బాక్సీఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో అతడి కెరీర్‌ ఇబ్బందికరంగా మారింది. వరుస ఫ్లాపులతో రౌడీ స్టార్ ఫ్యాన్స్‌ కూడా నిరాశకు గురవుతున్నారు.

అదొక్కటే మిగిలింది.. ఆశలన్నీ దాని మీదే

అదొక్కటే మిగిలింది.. ఆశలన్నీ దాని మీదే

ప్రస్తుతం విజయ్ సంతకం చేసిన సినిమాల్లో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్' మాత్రమే ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్' వంటి సూపర్ హిట్ తర్వాత ఆయన రూపొందిస్తున్న చిత్రం కావడంతో విజయ్‌తో పాటు ఆయన అభిమానులు ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని పూరీతో పాటు చార్మీ, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recommended Video

Fighter As a Pan India Film With Record Budget | Filmibeat Telugu
ఆయన ఎంట్రీతో సినిమా రేంజ్ పెరిగిపోయింది

ఆయన ఎంట్రీతో సినిమా రేంజ్ పెరిగిపోయింది

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు మొదట ‘ఫైటర్' అనే టైటిల్ అనుకున్నారు. అంతేకాదు, దీన్ని తెలుగులో మాత్రమే తీయాలని భావించారు. కానీ, కరణ్ జోహర్ ఈ స్క్రిప్టును చూసిన తర్వాత దీన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని నిర్ణయించారు. దీంతో సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అలాగే, టైటిల్‌ను కూడా ‘లైగర్' అని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఎంటర్ అయిన తర్వాత క్లియర్ అయింది

ఆమె ఎంటర్ అయిన తర్వాత క్లియర్ అయింది

ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్, ఆలియా భట్, కియారా అద్వాణి సహా ఎంతో మంది బాలీవుడ్ నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఇటీవల ఇందులో నటించే హీరోయిన్‌గా అనన్య పాండేను ఫైనల్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఆమెను పరిచయం చేశారు.

సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్న రౌడీ స్టార్.!

సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్న రౌడీ స్టార్.!

వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ తాజాగా సెన్సేషనల్ డెసీషన్ తీసుకున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్' రిలీజ్ అయ్యే వరకు విజయ్ మరో సినిమాలో నటించడనేదే ఆ వార్త సారాంశం. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

ఆయన కండీషన్స్ వల్లే ఈ నిర్ణయం

ఆయన కండీషన్స్ వల్లే ఈ నిర్ణయం

ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ పెట్టిన కండీషన్ల వల్లే విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. వేరే సినిమా ఒప్పుకుంటే ‘లైగర్' మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేడన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కండీషన్ పెట్టారని అంటున్నారు. హిట్ కోసం పరితపిస్తున్న విజయ్.. దీనికి ఒప్పుకోలేక తప్పలేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X