Balayya: నవ్వకండి.. 25వేల కేజీల సీరియస్ మ్యాటర్ - డ్రగ్స్ గురించి బాలయ్య అప్పుడే చెప్పారు కదరా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. తాజాగా ఏపీలోని విశాఖ సీపోర్ట్‌లో ఏకంగా 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్ లో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడిదే బాగా చర్చనీయాంశమైంది. అయితే ఇదే సమయంలో బాలయ్య డ్రగ్స్‌పై మాట్లాడిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతూ సంచలనంగా మారడం చూస్తునే ఉన్నాం. దీనిపై రాజకీయంగాను పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. డ్రగ్స్ విషయంలో తేదేపా, వైసీపీ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇదే సమయంలో తాజాగా ఏపీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టు పడడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

విశాఖ పోర్ట్‌లో కళ్లు చెదిరే రేంజ్లో ఏకంగా 25వేల కేజీల డ్రగ్స్‌ను మెరుపు దాడి చేసి మరీ సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఇంటర్‌పోల్ నుంచి వచ్చిన సమాచారంతో బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో ఈ భారీ డ్రగ్స్ దొరకడం సంచలనం క్రియేట్ చేస్తోంది. దీంతో మళ్లీ ఇది రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో బాలయ్య గతంలో అధికార ప్రభుత్వాన్ని విమర్శిస్తూ డ్రగ్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో షాకింగ్‌గా మారింది.
"డ్రగ్స్ అమలాపురం నుంచి వైజగ్ దాకా ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్. వాళ్లే తీసుకొచ్చేస్తున్నారు. యువకుల్ని నిందుతుల్ని చేసేస్తున్నారు. వేలెత్తి అడిగేవాళ్లను లేకుండా చేస్తున్నారు. వీళ్లకేమో ప్రాజెక్ట్‌లు రాక ఉద్యోగాలు లేక ఏమి చేయాలో తెలీక పాడైపోతున్నారు" అంటూ మాట్లాడారు. అయితే ఇదే సమయంలో పక్కవాళ్లు నవ్వితే.. 'నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్. నవ్వకండి' అంటూ బాలయ్య అనగానే పక్కన్న ఉన్నవాళ్లు సైలెంట్ అయిపోయారు. అప్పట్లో ఈ వీడియో బాగా ట్రెండ్ అయింది. అయితే ఇందులో బాలయ్య డ్రగ్స్ గురించి చెప్పిన మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కేవలం 'నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్' అనే దాన్ని బాగా ట్రోల్ చేశారు. మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో బాగా వాడారు.

అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 'మంచి చెబితే ఎవడికి చెవికి ఎక్కదు.అది వాడిదాక వస్తే కానీ ఆ బాధ తెలియదు.డ్రగ్స్ కోసం మూడు సంవత్సరాల క్రితం బాలయ్య చెప్పిన దాంట్లో మంచి వదిలేసి "నవ్వకండి ఇది సీరియస్ మేటర్ " అనే ఒక మాటను పట్టుకుని శునకానంద పొందిన ప్రతి ఒక్కరు ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నారు' అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ టాప్ స్టార్స్‌ను బీట్ చేసిన ప్రభాస్, మహేశ్, బన్నీ.. ఆ ఒక్కడిని తప్ప!
ఇకపోతే బాలయ్య ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో ప్రచార సభల్లో బిజీగా ఉన్నారు. అలానే సినిమా విషయానికొస్తే ఆయన బాబీ దర్శత్వంలో ఎన్బీకే 109 చేస్తున్నారు. ఇది త్వరలోనే ఈ ఏడాదే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











