ప్రభాస్ పేరు చెప్పగానే .. బ్యాంకాక్‌లో డైరెక్టర్ పూరికి ఊహించని షాక్!
Prabhas: బాహుబలి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో చెప్పే ఆసక్తికర సంఘటనను హీరో ప్రభాస్ ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఓటీటీలో విడుదలైన 'బాహుబలి: ది టార్చ్ బేరర్' డాక్యుమెంటరీలో దర్శకుడు పూరి జగన్నాథ్‌కు బ్యాంకాక్‌లో ఎదురైన అనుభవాన్ని ప్రభాస్ తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సంఘటన విన్న వారంతా ఆశ్చర్యపోగా, ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనమంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ చెప్పిన వివరాల ప్రకారం.. 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత,'బాహుబలి-2' షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైద్యుడిని కలవాలంటే దాదాపు గంటసేపు వేచి ఉండాలని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో పూరి వెయిటింగ్ ఏరియాలో కూర్చొని తన వంతు కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ నర్స్.. పూరి జగన్నాథ్ వద్దకు వచ్చి,"మీరు ఇండియా నుంచి వచ్చారా?"అని ప్రశ్నించిందట. దానికి పూరి అవునని సమాధానం ఇవ్వగానే, ఆమె వెంటనే "బాహుబలి?"అని అడిగింది. ఆ ప్రశ్న విని పూరి ఒక్కసారిగా పూరి ఆశ్చర్యపోయారని ప్రభాస్ చెప్పారు. వెంటనే పూరి,"మీరు బాహుబలి సినిమా చూశారా?"అని అడగగా, ఆ నర్స్ చిరునవ్వుతో "చూశాను.. ఇక్కడ చాలామంది చూశారు. మా ఫ్రెండ్స్‌లో కూడా ప్రభాస్ అభిమానులు చాలా మంది ఉన్నారు" అని సమాధానం ఇచ్చిందట.
ఆ మాటలు విన్న పూరి జగన్నాథ్ వెంటనే తన మొబైల్‌లో ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోలను చూపిస్తూ, "ప్రభాస్ నా స్నేహితుడు" అని చెప్పారు. ఆ ఫొటోలు చూసిన నర్స్ వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి, 'బాహుబలి హీరో ప్రభాస్ ఫ్రెండ్ బయట ఉన్నారు"అంటూ చెప్పిందట. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి, గంటసేపు వేచి ఉండాల్సిన పూరిని ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్లి వీఐపీ తరహాలో చికిత్స అందించారని ప్రభాస్ వెల్లడించారు.
ఈ సంఘటన పూరి జగన్నాథ్‌ను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందట. చికిత్స పూర్తయిన వెంటనే ఆయన ఈ విషయాన్ని ప్రభాస్‌కు ఫోన్‌లో వివరించడంతో పాటు, తన అనుభవాన్ని వాయిస్ మెసేజ్ రూపంలో కూడా పంపారని తెలిపారు. ఆ సమయంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి,నిర్మాత తదితరులు కూడా ఆ వాయిస్ మెసేజ్ విన్నారని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ,"జపాన్‌లో 'బాహుబలి'కి మంచి ఆదరణ లభిస్తుందని మాకు తెలుసు. కానీ బ్యాంకాక్‌లో కూడా ఇంతటి క్రేజ్ ఉంటుందని అసలు ఊహించలేదు. 'ప్రభాస్ ఫ్రెండ్' అనే ఒక్క మాటతో పూరి జగన్నాథ్‌కు ప్రత్యేక గౌరవం ఇవ్వడం నిజంగా మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో ఆ సంఘటనతో అర్థమైంది"అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'బాహుబలి' సినిమా భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించి పెట్టిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications




