రామ్‌కి ఎప్పుడూ అదే ఆలోచన.. పూరి జగన్నాథ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించేలా ఇస్మార్ట్ శంకర్ బోనాలు పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వరంగల్ నగరంలో జరిగిన ఈ ఈవెంట్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇస్మార్ట్ శంకర్ టీజర్, పాటలకు వస్తున్న రెస్పాన్స్ సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు పూరి. హీరో రామ్ వెజిటేరియ‌న్ వేషం వేసుకున్న నాన్ వెజిటేరియ‌న్‌ లాంటివాడని అన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. రామ్‌ని మాస్ గా ప్రెజెంట్ చూపిస్తోంది తాను కాదని, రామ్ లోనే మాస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. వాటిని బటయకు తీశానంతే.. అని పూరి చెప్పుకొచ్చారు. టెంపర్ సినిమా తర్వాత అతడి హిట్ కొట్టాలని మాంచి ఆక‌లి మీదున్న‌స‌మ‌యంలో నాకు రామ్ దొరికాడని, ఆయనకు సినిమాలు తప్ప వేరే ఆలోచనే ఉండదని పూరి అన్నాడు. రామ్ చిరుత‌పులి లాంటి వాడని, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పిల‌వ‌క‌ ముందే సీన్‌లోకి దూకే ఎనర్జీ రామ్ లో ఉందని ఈ సందర్బంగా పూరి జగన్నాథ్ పేర్కొన్నాడు.

Puri Jagannadh says about Hero Ram Pothineni Character

రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఇస్మార్ట్ శంకర్' మూవీ. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఛార్మి, పూరిజగన్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. మాస్ ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందించారు పూరి. భారీ అంచనాల నడుమ జులై 18 వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X