రామ్ చరణ్ మరో ఘనత.. కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో.. ప్రభాస్, ఎన్టీఆర్ ర్యాంక్ ఎంత?
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. తన నటన, డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చరణ్. ప్రస్తుత తరంలో టాలీవుడ్‌లో అగ్ర కథనాయకులలో ఒకడిగా మెగాస్టార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయి. తాజాగా ఆయన మరో అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన పెద్దితో సూపర్ హిట్ అందుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ కెరీర్‌లో రంగస్థలం, మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల స్థానంలో పెద్ది కూడా చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా పెద్ది నిలిచింది.

పెద్ది తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీని తెరకెక్కించనుంది. దసరాకి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దసరాకి గ్రాండ్ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి షూటింగ్‌ను అధికారికంగా పట్టాలెక్కించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత త్వరగా రామ్ చరణ్- సుకుమార్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నయనతార కనుక ఈ సినిమాలో జాయిన్ అయితే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్.. తాజాగా టీవోబీ ప్రచురించే మోస్ట్ పాపులర్ ఇండియన్ పర్సనాలిటీస్ లిస్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచారు. దేశంలోని స్పోర్ట్స్, సినిమా రంగంలోని దిగ్గజాలను అధిగమించి ఈ ప్లేస్‌ను దక్కించుకున్నారు రామ్ చరణ్. టాప్ 5లో ఆ తర్వాతి ప్లేస్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ స్టార్ యశ్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌లు నిలిచారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆరో స్థానంలో నిలవగా.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో నిలిచారు.
గత కొంతకాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 9వ స్థానంలో, టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ పదో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి 30 వరకు దేశంలో జరిగిన సంఘటనలు, ఫ్యాన్స్ బేస్, సోషల్ మీడియాలో యాక్టీవిటీ ఆధారంగా ఈ లిస్ట్‌ను ప్రచురించారు. రామ్ చరణ్ ఈ జాబితాలో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలవడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications


