అఖిల్‌‌తో ముద్దు కావాలన్న సీరియల్ నటి.. అక్కినేని హీరో రిప్లయ్ అలా!

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు తమిళ నటి దీపిక రంగరాజు. ఈ ధారావాహికలో కావ్య, ఇందూ పాత్రలలో ఒదిగిపోయారు. బ్రహ్మముడిలో నటించడంతో పాటు పలు ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో కనిపిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు దీపిక. ముఖ్యంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుకు విత్ జాతిరత్నాలు తదితర షోలలో తన అల్లరితో కడుపుబ్బా నవ్వించారు. తాజాగా ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో అఖిల్ అక్కినేనితో ఆమె అల్లరి వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్

శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం.. వారం వారం సరికొత్త థీమ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో శ్రీముఖి చేసే అల్లరి, ఆటపాటలు వినోదాన్ని పంచుతాయి. దీనిలో భాగంగా ఈ వారం లెనిన్ టీమ్ సందడి చేసింది. హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేలు స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు. అఖిల్‌ను చూడగానే చిన్నప్పుడు తొక్కాం సైకిల్.. హిట్ కొట్టేశాడు మా అఖిల్ అని ఎక్స్‌ప్రెస్ హరి... అయ్యగారే నెంబర్ వన్ అంటూ అవినాష్‌లు స్లోగన్స్ ఇచ్చారు.

Deepika Rangaraju s Fun Flirting with Akhil Akkineni Steals the Show on Adivaram With Star Maa Parivaram

ఆ వెంటనే భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇవ్వడంతో అంతా నవ్వేశారు. భాగ్యశ్రీ వస్తే ఏదో మాట్లాడాలని చెప్పావు కదా అని అవినాష్‌ను శ్రీముఖి పిలుస్తుంది. ఏం మాట్లాడాలి బ్రదర్ అని అఖిల్ సీరియస్ అవ్వడంతో అవినాష్ పారిపోతాడు. ఇంతలో దీపిక వచ్చి ఆరడుగుల యాపిల్ చెట్టు మీరు.. పెడతారా ఒక ముద్దు అని అడగటంతో అంతా షాక్ అయ్యారు. ముద్దు ఇవ్వను గానీ మ్యాగ్జిమమ్ హగ్ ఇవ్వగలనని దీపికను హత్తుకుంటాడు అఖిల్. ఆ తర్వాత ఊళ్లో చిన్నప్పుడు ఆడుకునే టైర్ ఆట, బొంగరం, కర్రబిల్లను అద్భుతంగా ఆడటంతో అందరూ అవాక్కవుతారు. మీ చేతిలో ఉంది బొంగరం నా చేతికి వేస్తారా ఉంగరం అని దీపిక మళ్లీ తగులుకోవడంతో మా ఆవిడ సంగతి తెలియదు నీకు అంటూ అఖిల్ కౌంటర్ వేస్తాడు. దీపిక గోల భరించలేక ఆ బొంగరం తీసి ఆవిడ నోట్లో వేసేయమని వార్నింగ్ ఇస్తుంది శ్రీముఖి.

Recommended For You
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయాలంటే ఏ సినిమాను రీమేక్ చేస్తారని అభిమానులు అడిగిన ప్రశ్నను శ్రీముఖి చదివి వినిపిస్తుంది. నాకు పోకిరి అంటే పిచ్చి అంటూ మహేశ్ చెప్పిన పండుగాడు డైలాగ్ చెప్పడంతో అంతా గోల గోల చేస్తారు. అనంతరం ఓ తెలుగు మాస్టర్ మీకు తెలుగు నేర్పించడానికి రాబోతున్నాడని శ్రీముఖి చెప్పడంతో అవినాష్ పంతులు గెటప్‌లో వస్తాడు. అసలు నీకు తెలుగు రాయడం వచ్చా అని అఖిల్ పంచ్ విసురుతాడు. బోర్డుపై అ అని రాసి అ అంటే అవినాష్ అని అనగా.. కాదు అఖిల్ అంటుంది భాగ్యశ్రీ. ఆ తర్వాత ఆ, ఇ, ఈ అని ఏం రాసినా దానికి అర్ధం అఖిల్ అంటూ ఈ ముద్దుగుమ్మ తన హీరోపై అభిమానాన్ని చాటుకుంది.

You May Also Like
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’

ఇక అన్న ఎన్టీఆర్ దానవీర శూరకర్ణలోని ఫేమస్ డైలాగ్ ఏమంటివి ఏమంటివి అన్న డైలాగ్‌ను గుక్కతిప్పుకోకుండా చెప్పి అలరించింది భాగ్యశ్రీ. ఈ డైలాగ్‌ని మీరు చెప్పండి అంటూ అవినాష్‌ను శ్రీముఖి అడగ్గా అతను షాక్ అవుతాడు. చివరిలో లెనిన్ సినిమాకు అఖిల్ సతీమణి జైనబ్ మారు వేషంలో వెళ్లడం, థియేటర్‌లో విజిల్ ఊదిన వీడియోను శ్రీముఖి స్క్రీన్ మీద చూపించింది. ఆ రోజున నువ్వు వెళ్లడం అవసరమా అని అడిగాను.. లేదు నేను వెళ్లాలి, విజిల్ కొట్టాల్సిందేనని చెప్పింది. తను చాలా మాస్.. కెమెరాలన్నీ ఉన్నాయి కాబట్టి చాలా కామ్‌గా ఉంది, లేదంటే వేరేలా ఉండేది. ఆమె నా లక్కీ చార్మ్ అని భార్యపై తన ప్రేమను బయటపెట్టారు అఖిల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. అఖిల్, భాగ్యశ్రీలతో బుల్లితెర సెలబ్రిటీలు చేసిన అల్లరి తెలియాలంటే ఈ వీక్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X