ఒక్కటవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఆ హీరోయిన్‌కు షాకిచ్చేలా ప్లాన్!

సెన్సేషనల్ యాక్టర్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జనగణమన చిత్రంలో మరో టాప్ హీరోయిన్ మెరిసేందుకు సిద్దమవుతున్నది. గతంలో విజయ్ దేవరకొండతో వరుసగా జంటగా నటించిన రష్మిక మందన్న మరోసారి ఈ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నది. ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రష్మిక మందన్న పేరు అనూహ్యంగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్టులో చేరింది. రష్మిక పాత్రకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్

పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్


పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటైన జన గణ మన సినిమాలో నటీనటుల ఎంపిక ప్రత్యేకంగా మారింది. ఈ సినిమా కోసం పూజా హెగ్డేకు పూరీ జగన్నాథ్ ఆఫర్ ఇవ్వగా.. డేట్స్ లేకపోవడంతో భారీ కసరత్తు చేసి.. వాటిని అడ్జస్ట్ చేశారు. అంతేకాకుండా పూజా హెగ్డే అడిగినంత అంటే.. 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి పూరీ సిద్దమయ్యాడనేది మీడియా వర్గాల సమాచారం.

విజయ్ దేవరకొండతో అఫైర్ రూమర్లు

విజయ్ దేవరకొండతో అఫైర్ రూమర్లు

ఇదిలా ఉండగా, వరుసగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించడంతో వారిద్దరి కాంబో క్రేజీగా మారింది. అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించడంతో వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, వారిద్దరి మధ్య అఫైర్ కొనసాగుతున్నదనే రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల రష్మిక ఫ్యామిలీ, విజయ్ దేవరకొండ కుటుంబం కలిసి వెకేషన్‌కు వెళ్లడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

పుష్ప తర్వాత రాకెట్ స్పీడ్‌తో

పుష్ప తర్వాత రాకెట్ స్పీడ్‌తో


ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న కెరీర్ ఇటీవల కాలంలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నది. ఇటీవల ఆమె నటించిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొన్నది. శ్రీవల్లిగా సామీ.. సామీ అంటూ ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో నెటిజన్లను తెగ ఆర్షించాయి. పుష్ప తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. ఈ క్రమంలో నేషనల్ ప్రాజెక్టుగా రూపొందుతున్న జనగణమనకు కూడా రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

రష్మిక మందన్న కెరీర్ ఇలా..

రష్మిక మందన్న కెరీర్ ఇలా..

రష్మిక మందన్న సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. మిషన్ మజ్ను, గుడ్ బై, సీతారామం, వారిసు, పుష్ప 2: ది రూల్, ఎనిమల్ చిత్రాల్లో నటిస్తున్నది. ఇంకా ఈ పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

Recommended Video

హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
ఐదు భాషల్లో జన గణ మన

ఐదు భాషల్లో జన గణ మన


ఇక జనగణమన సినిమా విషయానికి వస్తే.. ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతున్నది. ఆగస్టు 2023 తేదీల్లో రిలీజ్ చేయడానికి ఈ చిత్రాన్ని సిద్దం చేస్తున్నారు. జూన్ 4వ తేదీన ఈ చిత్రం షూటింగు ముంబైలో నిరాడంబరంగా ప్రారంభమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X