స్టార్ హీరో కూతురితో విజయ్ దేవరకొండ హల్‌చల్: ముంబైలో జంటగా రచ్చ.. అలా బయటకొచ్చిన మేటర్

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రలు చేసిన అతడు.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మెప్పించిన అతడు.. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ యంగ్ హీరో.. ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు స్టార్ హీరో కూతురితో కలిసి ముంబైలో హల్‌చల్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఆరంభంలో హిట్లు.. ఇప్పుడు ఫ్లాపులు

ఆరంభంలో హిట్లు.. ఇప్పుడు ఫ్లాపులు

'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే, కొద్ది రోజులుగా అతడి కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. ఇటీవలి కాలంలో అతడు నటించిన 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన రౌడీ స్టార్

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన రౌడీ స్టార్

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.... బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది.

వాళ్ల కలయికపై పెరిగిన అంచనాలు

వాళ్ల కలయికపై పెరిగిన అంచనాలు

టాలీవుడ్‌లో తనదైన శైలిని ఏర్పరచుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అలాగే, పూరీ జగన్నాథ్‌కు కూడా హీరో ఎలివేషన్‌లో భిన్నమైన పనితనం ఉంది. అందుకే వీళ్లిద్దరి కలయికపై భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన పోస్టర్లు వాటిని రెట్టింపు చేసేశాయి. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.

బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా విజయ్

బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా విజయ్

'లైగర్' మూవీ పుణ్యమా అని విజయ్ దేవరకొండ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు. దీనికి కారణం అతడు తన బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినప్పటి నుంచి ముంబై నగరంలోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి పార్టీల్లో కూడా పాల్గొంటున్నాడు. ఇలా స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతన్నాడీ స్టార్ హీరో.

 స్టార్ట్ చేయబోతున్న లైగర్.. ఎంటర్

స్టార్ట్ చేయబోతున్న లైగర్.. ఎంటర్

పాన్ ఇండియా సినిమా కావడంతో 'లైగర్' షూటింగ్ ముంబైలో ప్రారంభం అయింది. అక్కడ కొద్ది రోజుల పాటు చిత్రీకరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత చిత్రీకరణను పున: ప్రారంభించనున్నారు. ఇందుకోసం విజయ్ దేవరకొండ సహా చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితమే ముంబై నగరం చేరుకుంది.

 స్టార్ హీరో కూతురితో విజయ్ హల్‌చల్

స్టార్ హీరో కూతురితో విజయ్ హల్‌చల్

ముంబైలో అడుగు పెట్టిన వెంటనే విజయ్ దేవరకొండ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. దీనికి కారణం అతడు స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. తాజాగా ముంబై నగరంలో జరిగిన ఓ పార్టీలో పాల్గొన్న వీళ్లిద్దరూ జంటగా హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

GQ25 Most Influential Young Indians : Allu Arjun కి స్థానం , Pant, Kl Rahul కూడా..!!
 జంటగా రచ్చ.. అలా బయటకొచ్చిన మేటర్

జంటగా రచ్చ.. అలా బయటకొచ్చిన మేటర్

ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించిన సారా అలీ ఖాన్.. విజయ్ దేవరకొండతో దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అంతేకాదు, దీనికి ఫ్యాన్ మూమెంట్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఓ హీరోయిన్.. మన విజయ్ దేవరకొండతో ఫొటో దిగడంతో పాటు ఫ్యాన్ మూమెంట్ అని రాయడం హైలైట్ అయింది. దీంతో మనోడు మరోసారి దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X