ఐదుగురి దర్శకుల చేతుల మీదుగా.. ఇది మామూలు ప్రమోషన్స్ కాదు!
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఫుల్ స్పీడులో ఉన్నాడు. ఏ1 ఎక్స్‌ప్రెస్‌తో మంచి ఫాంలోకి వచ్చాడు. అసలే వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు సందీప్ కిషన్. నిను వీడిని నీడను నేను, తెనాలి రామకృష్ణ సినిమాలతో హిట్లు కొట్టాడు. తాజాగా ఏ1 ఎక్స్‌ప్రెస్ అంటూ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా సందీప్ కిషన్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ అప్డేట్ వచ్చింది.
సందీప్ కిషన్ బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రాబోతోన్న మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ మూవీ కొత్త టైటిల్‌ను లాంచ్ చేసేందుకు ఐదుగురు టాప్ డైరెక్టర్స్‌ను రంగంలోకి దించారు. ఇంతకు ముందు రౌడీ బేబీ అనే టైటిల్‌తో ఈ మూవీ రాబోతోన్నట్టు ప్రకటించారు.అయితే కొన్ని సమస్యలు తలెత్తడంతో రౌడీ బేబీ టైటిల్‌ను వదిలేసుకోవాల్సి వచ్చింది.

అందుకే ఈ కొత్త టైటిల్‌పై అందరికీ ఆసక్తి కలిగేలా, అందరి దృష్టి పడేలా పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, బాబీ, శివ నిర్వాణ, హరీష్ శంకర్ ఇలా ఐదుగురు దర్శకులతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ ఐదుగురు దర్శకులు కలిసి మార్చి 10న ఉదయం పది గంటలకు పది నిమిషాలకు కొత్త టైటిల్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. నేహా శెట్టి హీరోయిన్‌గా వస్తోన్న ఈ మూవీకి జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











