విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం: దాని కోసం ఏకంగా నాలుగు.. రౌడీ తీరుకు వాళ్లంతా షాక్

చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ ఉంటే రాణించవచ్చు అని నిరూపించిన ఈ కుర్రాడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న 'లైగర్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీని కోసం విజయ్ దేవరకొండ పెద్ద సాహసమే చేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

 హిట్లతో మొదలు.. వరుస ఫ్లాపులతో

హిట్లతో మొదలు.. వరుస ఫ్లాపులతో

'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే, కొద్ది రోజులుగా అతడి కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ క్రేజీ హీరో నటించిన 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

బాలీవుడ్‌లో అడుగెడుతోన్న విజయ్

బాలీవుడ్‌లో అడుగెడుతోన్న విజయ్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది.

భారీ అంచనాలు... రిలీజ్ డేట్ కూడా

భారీ అంచనాలు... రిలీజ్ డేట్ కూడా

టాలీవుడ్‌లో తనదైన శైలిని ఏర్పరచుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అలాగే, పూరీ జగన్నాథ్‌కు కూడా హీరో ఎలివేషన్‌లో భిన్నమైన పనితనం ఉంది. అందుకే వీళ్లిద్దరి కలయికపై భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన పోస్టర్లు వాటిని రెట్టింపు చేసేశాయి. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.

బాక్సింగ్ నేపథ్యంతో... వాళ్ల శిక్షణలో

బాక్సింగ్ నేపథ్యంతో... వాళ్ల శిక్షణలో

'లైగర్' మూవీ బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ఇంకొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే విజయ్ దేవరకొండ విదేశీ బాక్సర్ల నుంచి శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించేందుకు చాలా రోజుల పాటు మెళకువలు నేర్చాడు.

విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం


పూరీ జగన్నాథ్ రూపొందిస్తోన్న 'లైగర్' కోసం విజయ్ దేవరకొండ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాక్సింగ్ రింగ్ కోసం చెమటోడ్చుతోన్న అతడు.. సిక్స్ ప్యాక్‌తో కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. అలాగే, సరికొత్త బాడీ లాగ్వేజ్‌ను ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే విజయ్.. 'లైగర్' కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

దాని కోసం ఏకంగా నాలుగు ట్రై చేస్తూ

దాని కోసం ఏకంగా నాలుగు ట్రై చేస్తూ

'లైగర్' మూవీ ఐదు భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా నాలుగు భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడట. ఇప్పటికే తెలుగు, హిందీ మీద పట్టు సాధించిన అతడు.. తమిళం, కన్నడం భాషలను కూడా నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడి తీరుకు యూనిట్ షాక్‌లో ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X