మళ్లీ మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ.. ఫైటర్ కోసం రౌడీ కష్టాలు!!

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లు ఓ ప్యాన్ ఇండియన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్‌గా ఫైటర్ అని అందరూ పిలుస్తున్నారు. కానీ అఫీషియల్‌గా ఇంకా ప్రకటించలేదు. అయితే ఆ మధ్య ముంబై నడివీధుల్లో అర్ధరాత్రి రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించాడు పూరి జగన్నాథ్. అనన్య పాండే విజయ్ దేవరకొండల రొమాన్స్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అప్పట్లో ఒకే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ ఫైటర్ కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

ఫైటర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ స్పెషల్‌గా థాయిలాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. బాడీని కూడా మార్చుకున్నాడు. జిమ్‌లో కష్టపడి శరీరాకృతిని ధృడంగా మార్చుకున్నాడు. కానీ మధ్యలో కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో మళ్లీ బాడీ యథావిథిగా మారిపోయింది. ఆ మధ్యలో జిమ్‌లో బాగానే కష్టపడ్డాడు విజయ్. కానీ షూటింగ్ మొదలయ్యే దాఖలాలు కనిపించకపోవడం కొన్ని రోజుల రిలాక్స్ అయ్యాడు. ఇక జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.

Vijay Devarakonda Doing workout For VD10 Movie

ఈ క్రమంలో మళ్లీ బాడీని పెంచే క్రమంలో విజయ్ దేవరకొండ పడ్డాడు. ఇందు కోసం జిమ్‌లో ఈ రౌడీ హీరో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ షేర్ చేశాడు. విజయ్ కష్టపడుతున్న తీరుపై పూరి స్పందించాడు. దట్స్ మై హీరో.. దట్స్ మై ఫైటర్.. నువ్ నన్ను గర్వంగా ఫీలయ్యేలా చేస్తున్నావ్.. లవ్యూ విజయ్ అంటూ ప్రశంసలు కురిపించేశాడు పూరి జగన్నాథ్. మొత్తానికి విజయ్ వర్కవుట్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X