కొరియోగ్రాఫర్‌కు భయపడుతోన్న విజయ్ దేవరకొండ: ఏకంగా సినిమా షూటింగ్‌నే ఆపేశాడు!

ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి.. తక్కువ సినిమాలతోనే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' సినిమాలో డీసెంట్‌‌గా కనిపించిన అతడు.. 'అర్జున్ రెడ్డి'లో వైలెంట్‌గా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో వరుస పరాజయాలు ఎదురవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తున్న అతడు.. ఓ కొరియోగ్రాఫర్‌కు భయపడిపోతున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

Recommended Video

Sukumar High Voltage Story For Vijay Devarakonda Project
ముందు విజయాలు.. ఇప్పుడు ఫ్లాపులు

ముందు విజయాలు.. ఇప్పుడు ఫ్లాపులు

కెరీర్ ఆరంభంలో 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే, కొద్ది రోజులుగా అతడి కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. ఇటీవలి కాలంలో అతడు నటించిన 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

బడా డైరెక్టర్‌తో మూవీ... పాన్ ఇండియా

బడా డైరెక్టర్‌తో మూవీ... పాన్ ఇండియా

తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.... బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ముంబైలో రచ్చ... హీరోయిన్‌తో షికార్లు

ముంబైలో రచ్చ... హీరోయిన్‌తో షికార్లు

ఫైటర్ మొదలైనప్పటి నుంచి విజయ్ దేవరకొండ ముంబై నగరంలోనే ఎక్కువగా కనిపించాడు. అక్కడ జరిగిన బాలీవుడ్ సెలెబ్రిటీల పార్టీల్లో కూడా పాల్గొన్నాడు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్ కూడా ముంబైలోనే జరుపుతున్నారు. ఆ సమయంలోనే హీరోయిన్‌తో అతడు చేసిన సీన్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

 ఫైటర్‌కు వరుస బ్రేకులు.. పుకార్లు అలా

ఫైటర్‌కు వరుస బ్రేకులు.. పుకార్లు అలా

ఫైటర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీన్ని చిత్రీకరించారు. అలాంటి సమయంలో కరోనా వైరస్ కారణంగా షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత డిసెంబర్ రెండో వారం నుంచి చిత్రీకరణ పున: ప్రారంభించాలని అనుకున్నా పర్మీషన్ రాలేదు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటే అది కాస్తా వాయిదా పడింది.

యూటర్న్ తీసుకున్న అర్జున్ రెడ్డి హీరో

యూటర్న్ తీసుకున్న అర్జున్ రెడ్డి హీరో

వరుసగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం.. మళ్లీ వాయిదా పడడం.. ఇలా 'ఫైటర్' షూటింగ్ పున: ప్రారంభం అవడం లేదు. దీంతో జనవరి మూడో వారం నుంచి దీన్ని మొదలెడదామని పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో చర్చించాడని తెలిసింది. దీనికి మొదట మొదట ఓకే చెప్పిన అతడు.. ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

అతడికి భయపడుతోన్న విజయ్ దేవరకొండ

అతడికి భయపడుతోన్న విజయ్ దేవరకొండ


'ఫైటర్'కు పని చేసే యాక్షన్ కొరియోగ్రాఫర్ థాయ్‌లాండ్ నుంచి రావాలి. కొద్ది రోజులుగా కరోనా రెండో దశ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు షూటింగ్‌లో పాల్గొనడం మంచిది కాదని విజయ్ దేవరకొండ భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యమైనా పర్లేదు కానీ, యూనిట్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న కారణంగానే సినిమా షూటింగ్‌ను మరోసారి వాయిదా వేశాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X