కొత్త విద్యను నేర్చుకుంటోన్న విజయ్ దేవరకొండ: అప్పటి నుంచే రింగులో అడుగు పెడతాడట

చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ప్రారంభించాడు లోకల్ బాయ్ విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. అందులో పక్కింటి అబ్బాయిలా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం వైలెంట్‌గా దర్శనమిచ్చి యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి పలు విజయాలు అందుకుని.. కొన్ని పరాజయాలను చవి చూస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగానూ ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడీ రౌడీ స్టార్.

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రమే 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంతో సాగే ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లిపోయింది. ఇక, ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడట. కేవలం బేసిక్స్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ బాక్సర్‌లా కనిపించాలన్న లక్ష్యంతో తెగ కష్టపడుతున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ ట్రైనింగ్ సెషన్ ఎప్పటి నుంచో జరుగుతుందని, మరో వారం రోజులు ఉంటుందని టాక్.

Vijay devarakonda Learning Boxing for Liger

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న 'లైగర్'ను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే కొన్ని ముంబైలో చాలా వరకు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. కరోనా కారణంగా ప్యాకప్ చెప్పేసింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత మార్చి నాలుగో వారం నుంచి చిత్రీకరణ పున: ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X