షాకిస్తున్న విజయ్ దేవరకొండ న్యూ లుక్.. ట్రోల్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త బాబు!

యూత్ లో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసినా అందులో ఎదో ఒక స్పెషల్ పాయింట్ ఉంటుంది. కొత్తగా కనిపించాలని లుక్ విషయంలో కూడా ఈ కుర్ర హీరో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది.

Recommended Video

Vijay Devarakonda Helping Thousands Of People Through His Foundation
 నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

ఫాథర్స్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో తండ్రితో ఉన్న ఒక ఫోటోని షేర్ చేశాడు. అలాగే తన తండ్రిపై ఉన్న ప్రేమను కూడా తెలియజేశాడు. నేను నీతో ఉంటాను.. అని మీరు ఎప్పుడు నాకు చెబుతూనే ఉంటారు. తప్పులు, రిస్క్, అడ్వెంచర్ లు చేస్తున్నప్పుడు నాకు ఆ మాట చెబుతూనే ఉంటారు.. అని విజయ్ చేసిన ట్వీట్ నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

విజయ్ కొత్త లుక్..

విజయ్ కొత్త లుక్..

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన విజయ్ దేవరకొండ ఒక కొత్త లుక్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని విధంగా లుక్ ని చేంజ్ చేశాడు. ఈ లుక్ పై ఓ వర్గం అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. ట్రోలింగ్ చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా దేవరకొండ లుక్స్ పై ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ విజయ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్..

కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్..

కానీ ఎప్పుడో ఒకసారి ట్రోలింగ్ చేసేవాళ్లకు విజయ్ కొన్ని కౌంటర్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దీంతో ఈ సారి మళ్ళీ ట్రోల్ చేస్తున్నావారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం విజయ్ వెబ్ సైట్ గాసిప్స్ రూమర్స్ పై కూడా ఏ రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

మళ్ళీ కౌంటర్ ఇస్తాడా..

మళ్ళీ కౌంటర్ ఇస్తాడా..

ఆ తరువాత విజయ్ మీద గాసిప్స్ చాలా వరకు తగ్గాయని తెలుస్తోంది. ఇక ఇప్పుడు న్యూ లుక్ హాట్ టాపిక్ గా నిలవడంతో విజయ్ కొత్త కౌంటర్ ఏమైనా ఇస్తాడామో అనే డౌట్ వస్తోంది. ఇక నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X