కన్ఫ్యూజన్ లో ఉన్న అభిమానులకు క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసిన డిఫరెంట్ గానే ఉంటుంది. మొన్నటి వరకు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొత్త తరహా కథలతోనే వచ్చాడు. చాలా వరకు కమర్షియల్ యాంగిల్స్ కి దూరంగా ఉండే విజయ్ నెక్స్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సీనియర్ డైరెక్టర్ తో విజయ్ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు.

ఇకపోతే విజయ్ మొన్నటివరకు వివిధ ప్రాజెక్టుల షూటింగ్ లలో ఒకేసారి పాల్గొన్నాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీలను చాలా కష్టపడి పూర్తి చేసినప్పటికీ ఆ సినిమాలు ఎలాంటి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక నెక్స్ట్ ఫైటర్ సినిమా తరువాత విజయ్ ఎవరితో వర్క్ చేస్తున్నాడన్న విషయంలో అభిమానులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రౌడీ స్టార్ ఎలాంటి సందేహాలు లేకుండా అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చాడు.

Vijay devarakonda next two movies after fighter project

నెక్స్ట్ రెండు సినిమాలు దాదాపు ఫిక్స్ అయినట్లు వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా అనంతరం నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. ఇక ఆ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్ మరో సినిమా చేయనున్నట్లు చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ ప్రాజెక్టులతో రౌడీ స్టార్ తన మార్కెట్ ని ఎంతవరకు పెంచుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X