విజయ్ దేవరకొండ మళ్లీ స్టార్ట్ చేయబోతున్నాడు.. డేట్ కూడా ఫిక్స్ చేసేశారు

తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. 'పెళ్లి చూపులు' సినిమాలో డీసెంట్‌‌గా కనిపించిన అతడు.. 'అర్జున్ రెడ్డి'లో వైలెంట్‌గా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో వరుస పరాజయాలు ఎదురవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. అయినప్పటికీ తన మార్కెట్‌ను మాత్రం గణనీయంగా పెంచుకున్నాడీ క్రేజీ హీరో. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అతడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. ముంబైలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీన్ని చిత్రీకరించారు. అలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ కారణంగా షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ రెండో వారం నుంచి చిత్రీకరణ పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఇది మరోసారి వాయిదా పడిందట. ముంబైలో పరిస్థితులు ఇంకా సర్ధుబాటు కాకపోవడంతో, జనవరి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ మొదలెట్టాలని నిర్ణయించుకున్నాడట పూరీ జగన్నాథ్.

 Vijay Devarakondas Fighter Shoot will starts from December 26

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 26 నుంచి మొదలు కాబోతుందట. ముంబైలో జరగనున్న ఈ షెడ్యూల్‌లో ఓ కీలకమైన ఫైట్ సీన్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. సినిమాలోనే హైలైట్‌గా నిలిచే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X