స్టార్ దర్శకుడితో విజయ్ దేవరకొండ చర్చలు.. ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు.. కానీ?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నెవ్వర్ బిఫోర్ ఎలా లైగర్ సినిమాతో సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమా సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరికీ కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైనది. పూరీ జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. ఇక అతని కంటే తరువాత వచ్చిన వారు కూడా పాన్ ఇండియా సినిమాలతో వారి స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. ఇక పూరీ జగన్నాథ్ కూడా మరో లెవెల్ కు వెళ్లే విధంగా రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ కూడా చివరగా కొన్ని సినిమాలతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక లైగర్ సినిమాతో మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

లైగర్ సినిమాపై ప్రస్తుతం అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేయగా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక సినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేస్తుందని కూడా అంటున్నారు. అయితే శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయడానికి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

Vijay devarakonda upcoming projects interesting updates,

అంతే కాకుండా సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో కథలను అయితే ఇంకా వినలేదట. ఇక ముందుగా శివ నిర్వాణ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆ దర్శకుడు ఇటీవల జగదీష్ సినిమాతో ఊహించని విధంగా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ అయితే వచ్చింది.

కానీ అందులో ఎలాంటి నిజం లేదని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు. శివ నిర్వాణ తో ముందు నుంచి విజయ్ దేవరకొండ కు మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి అతని దర్శకత్వంలో మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అతను చెప్పిన మెయిన్ ప్లాట్ విజయ్ కు చాలా బాగా నచ్చిందట. ఇక లైగర్ ప్రస్తుతం యూఎస్ షెడ్యూల్ పూర్తవగానే శివ నిర్వాణ పూర్తి కథను మరొకసారి వినిపించనున్నాడట. ఇక కథలో ఎలాంటి మార్పులు అవసరం లేకపోతే ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరగా సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి విజయ్ సుకుమార్ దర్శకత్వంలో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. అలాగే మరికొంత మంది స్టార్ దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X