అదే పనిలో ఉన్న రౌడీ స్టార్.. ఫైటర్ కోసం పాట్లు!
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రూట్‌ను మార్చేశాడు. తన శైలికి భిన్నంగా పూరి జగన్నాద్‌తో కలిసి ఫైటర్ (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమని, ఈ చిత్రం తరువాత ఎన్నో మార్పులు చూస్తారని ఆ మధ్య విజయ్ చెప్పుకొచ్చాడు. తన శరీరాకృతిని కూడా పూర్తిగా మార్చేస్తుందని మొత్తం కొత్తగా ఉంటుందని విజయ్ బాగానే హైప్ క్రియేట్ చేశాడు. దీనికి తగ్గట్టే విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వచ్చాడు.
ముంబైలో భారీ షెడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. రొమాంటిక్ సీన్లతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా తెరెక్కించినట్టు తెలుస్తోంది. అయితే మధ్యలో లాక్ డౌన్ రావడంతో అంతా తారుమారైంది. గత మూడు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్నారు. సినిమాలు, షూటింగ్‌ల ప్రస్థావన లేకుండా ఇంటి పట్టునే ఉండాల్సి రావడంతో విజయ్ లుక్ కూడా బాగానే మారిపోయినట్టు తెలుస్తోంది.

అయితే ఫైటర్ చిత్రానికి కావాల్సిన ఫిట్‌నెస్ కోసం ఇంటి వద్ద నుంచే కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ తన ట్రైనర్ ఆధ్వర్యంలో విపరీతంగా వర్కౌట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ మొదటి సారి తెరపై ఫిట్‌నెస్, కండలతిరిగిన దేహంతో కనబడబోతోన్నాడు. ప్రస్తుతం విజయ్ వర్కౌట్లకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











