డిజాస్టర్ మూవీతో 'లైగర్'పై అంచనాలను పెంచుతున్న విజయ్ దేవరకొండ.. నెవర్ బిఫోర్ రికార్డ్
రౌడి స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు ఆడియెన్స్ లో అంచనాలను గట్టిగా పెంచేస్తున్నాడు. మొదటి సినిమా నుంచి కూడా విజయ్ సెలక్షన్ ఎంత డిఫరెంట్ గా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ కు వెళుతున్న రౌడి స్టార్ ఒక డిజాస్టర్ సినిమాతో హిందీలో మాత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో..
విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంగా చేసిన సినిమాల్లో వరల్డ్ ఫేమస్ లవర్ ఒకటి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతూ వచ్చాయి. సీనియర్ నిర్మాత కెఎస్.రామారావు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రాశి ఖన్నా, క్యాథరిన్, ఐజాబెల్లె హీరోయిన్స్ గా నటించారు.

డిఫరెంట్ షేడ్స్ తో మెప్పించిన విజయ్
సినిమాలో విజయ్ డిఫరెంట్ షేడ్స్ తో తన సరికొత్త నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే సినిమా మొత్తంగా మిగతా విషయాల్లో ఆడియెన్స్ ను అంతగా మెప్పించలేదు. విజయ్ నటన బాగుండడం వలన ఎక్కువ స్థాయిలో నిర్మాతలు నష్టపోలేదు. ఎంతగానో సక్సెస్ అవుతుందని అనుకున్న ఆ సినిమా మొత్తానికి ఒక దగ్గర మాత్రం హిట్టయ్యింది.

యూ ట్యూబ్ లో న్యూ రికార్డ్
సాధారణంగా బిగ్ స్క్రీన్ పై ఆ స్థాయిలో ప్లాప్ అయితే టీవీలలో కూడా పెద్దగా రేటింగ్ అందుకోవు. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ ను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా అమితంగా రెస్పాన్స్ అందుకుంది. వారం తిరక్కుండానే యూ ట్యూబ్ లో హాఫ్ సెంచరీ కొట్టేసింది. 6 రోజుల్లో మొత్తం 57 మిలియన్ల వ్యూవ్స్ రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లైగర్ సినిమాకు ఇది మంచి బూస్ట్
విజయ్ దేవరకొండ డబ్బింగ్ సినిమాలకు కూడా గత కొంతకాలంగా హిందీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలు అన్ని కూడా ఆడియెన్స్ లో అంచనాల డోస్ ను పెంచుతున్నాయి. ఒక విదంగా రాబోయే లైగర్ సినిమాకు ఇది మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి ఆ సినిమాతో విజయ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











