ఆయన డైలాగ్స్ చెప్పాలంటే నోచుకొని పుట్టాలి.. పూరీ జగన్నాథ్, చార్మీ నా అమ్మ, నాన్న అంటూ విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహర్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లోని కాజీపేటకు సమీపంలోని మడికొండలో ఉన్న సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

మిమ్మల్ని మిస్ అవుతున్నామని..
నమస్తే వరంగల్. ఈవెంట్‌కు హాజరైన, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు నా థ్యాంక్స్. ఇండియాలో సగం తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఎక్కడ తిరిగినా మనవాళ్లు ఏమనుకొంటున్నారనే ఆలోచన నాలో ఉంటుంది. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నారనే కారణంతో వరంగల్‌కు వచ్చి పెద్ద ఈవెంట్ చేద్దామని అనుకొన్నాం. వర్షం కారణంగా చేయలేకపోయాం. అందుచేత ఈ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి దయాకర్ రావుకు ధన్యవాదాలు అని విజయ్ దేవరకొండ అన్నారు.

మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా
ఎక్కడ తిరిగినా, ఏం చేసినా తెలంగాణ, ఆంధ్రా ప్రజలు, ప్రేక్షకుల ప్రేమ వల్లనే నేను ఈ స్థితికి వచ్చాను. మీరు కురిపించిన ప్రేమను ఆగస్టు 25న తిరిగి ఇచ్చేస్తాం. ఈ సినిమా బ్లాక్ బస్టర్. వరంగల్, తెలంగాణ, ఆంధ్రాలో మీరు షేక్ చేసి దేశానికి మార్గదర్శకంగా ఉండాలి అని విజయ్ దేవరకొండ అన్నారు.

నన్ను సూపర్ స్టార్ అంటుంటూ
లైగర్ సినిమాలో నన్ను గొప్పవాడిని చేయడానికి కరీంనగర్ నుంచి మా అమ్మ (రమ్యకృష్ణ) నేను హైదరాబాద్‌కు బయల్దేరుతాం. అలాగే నన్ను సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటుంటే.. నాకు మంచిగా అనిపించదు. ఇంకా నేను ఏం సాధించలే. ఇంకా చేయాల్సి చాలా ఉంది. హైదరాబాద్ నుంచి నేను ఇండియాను షేక్ చేయడానికి ముంబై వెళ్లాం. ఏ ఇబ్బంది వచ్చినా.. ఏది ఎదురైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాం అని విజయ్ దేవరకొండ అన్నారు.

పూరీ రాసిన డైలాగ్ చెప్పాలంటే
లైగర్ సినిమా కోసం నా తండ్రిగా మారి పూరీ జగన్నాథ్, నా అమ్మగా మారి చార్మీ ఇక్కడ నుంచి ముంబైకి వెళ్లాం. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. పూరీ రాసిన డైలాగ్స్ చెప్పాలంటే.. ఏ హీరో అయినా నోచుకోని పుట్టాలి. నేను పూరీ గారు రాసిన డైలాగ్స్ చెప్పగలిగాను. నేను చెప్పే డైలాగ్ మీరు కూడా చెప్పండి అంటూ.. వీ ఆర్ ఇండియన్స్.. పోదాం.. కొట్లాడుదాం.. గుండెలో ఆగ్ ఉంది. సబ్‌కో ఆగ్ లాగాదేంగే అని ప్రేక్షకుల చేత చెప్పించారు.

ఆగస్టు 25న వాట్ లగా దేంగే..
లైగర్ చిత్రం ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది. ఆ రోజు మనం వాట్ లాగా దేంగే. ఈ సినిమాలో నాతో పనిచేసిన ఒక్కరికి ధన్యవాదాలు. వరంగల్ ప్రజలకు ప్రేమతో కూడిన థ్యాంక్స్. మీ అందరికి ఐ లవ్ యూ అంటూ లైగర్ సినిమా స్టయిల్‌లో విజయ్ దేవరకొండ చెప్పారు.


Click it and Unblock the Notifications











