Liger మెంటల్.. మెంటల్.. అదొక్కటే మాట పూరికి చెప్పా.. విజయ్ దేవరకొండ

సెన్సేషన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని చలపతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మీ, విష్, పూరీ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

మీ వద్దకు రావాలని చాలా రోజులుగా

మీ వద్దకు రావాలని చాలా రోజులుగా


నమస్తే గుంటూరు. ఈ వీడియోను ఇంట్లో నుంచి చూస్తున్న ప్రతీ ఒక్కరికి నమస్కారం. ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. మీ వద్దకు రావాలి. మిమ్మల్ని కలువాలని అనుకొంటున్నాను. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమా లైగర్. ఈ సినిమాను మీ వద్దకు తీసుకురావాలి. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీ వద్దకు రావాలనుకొన్న సమయంలో లైఫ్‌లో డ్రామా మొదలైంది. నా ఆరోగ్యం సహకరించడం లేదు. ఒక్కో రోజు ఒక సిటీలో తిరుగుతున్నాం అని విజయ్ దేవరకొండ అన్నారు.

ఇండియాలో ఎక్కడికి వెళ్లినా గానీ..

ఇండియాలో ఎక్కడికి వెళ్లినా గానీ..


గుంటూరులో మీ ముందు నిలబడి ఉన్నానంటే.. మీరు చూపిస్తున్న ప్రేమ వల్లనే. ఇక్కడే కాదు.. ఇండియాలో ఎక్కడకు వెళ్లిన విశేషమైన ప్రేమను కురిపించారు. అందుకే నేను ప్రతీ చోటకు వెళ్తున్నాను. నాకు 60 ఏళ్లు వచ్చి ఇంట్లో కూర్చున్నా నేను ఈ ప్రేమను మరిచిపోలేను. దీని గురించి ఆలోచిస్తూనే ఉంటా. మీరు నాకు జీవితాంతం గుర్తుంచుకొనే అనుభూతులను పంచారు. ఇక మీకు నేను తిరిగి ఇవ్వాలి. అది నా బాధ్యత అని విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.

పూరీ కథ చెప్పగానే మెంటల్ ఎక్కింది.

పూరీ కథ చెప్పగానే మెంటల్ ఎక్కింది.


లైగర్ సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది. మీకు మరిచిలేని విధంగా అనుభూతిని పంచే సినిమా లైగర్. మీకు ప్రతీ మూమెంట్ చాలా కనెక్ట్ అవుతుంది. లైగర్ సినిమా కథ విన్న తర్వాత వీడు ఏం చెబుతాడని పూరీ, చార్మీ నావైపు చూస్తున్నారు. నా నోటి నుంచి మెంటల్ అనే ఒకే మాట వచ్చింది. కానీ ఈ సినిమాను తొందరగా మనోళ్లకు సినిమా చూపించాలని ఎక్సైట్‌మెంట్ ఉండేది. మనోళ్లు మస్త్ ఎంజాయ్ చేస్తారనిపించింది అని విజయ్ దేవరకొండ అన్నారు.

గుంటూరును షేక్ చేయాలి అంటూ

గుంటూరును షేక్ చేయాలి అంటూ


లైగర్ షూటింగ్ చేసేటప్పుడు నాకు మెంటల్ అనే మాట ఎప్పుడూ వచ్చేది. నేను చేసే ప్రతీ సీన్ తర్వాత మనోళ్లకు ఈ సినిమా చూపించాలని లోపల ఉండేది. ఇంకా ఐదు రోజుల్లో లైగర్ సినిమా మీ ముందుకు వస్తున్నది. సినిమా కుమ్మేస్తదని గుంటూరు ప్రజలకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. మీరు నా గురించి ఒకటే చేయాలి. ఆగస్టు 25న గుంటూరును షేక్ చేయాలి. చేస్తున్నారా లేదా.. ఈ రోజు గుంటూరులో నిలబడి ఉన్నాను. మీ పర్మిషన్ ఇస్తే.. ఇండియాకు ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకొంటాను. ఇండియాకు వాట్ లాగేదేంగే అని విజయ్ దేవరకొండ అర్ధాంతరంగా ప్రసంగాన్ని ముగించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ రచ్చ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ రచ్చ


గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు రచ్చ రచ్చ చేశారు. చాలా మంది ఫ్యాన్స్ వేదిక మీదకు తోసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారిని కట్టడి చేయడానికి చాలా సెక్యూరిటీ భారీగా ప్రయత్నించారు. అమ్మాయిలు పరుగెత్తుకొంటూ వచ్చి కౌగిలించుకొన్నారు. అభిమానులు మధ్య తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన నిర్వాహకులు విజయ్ దేవరకొండ ప్రసంగాన్ని మధ్యలో ఆపేయడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X