twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్.. కల్యాణ్.. రామ్ తర్వాత విజయ్ దేవరకొండే.. ప్లాన్ చేస్తున్న బడా డైరెక్టర్

    |

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది.

    క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్‌లో జరగనున్నాయని, ఆ తర్వాత అంటే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    Vijay Deverakonda six pack In Puri Jagannadhs Fighter

    ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోడానికి 'థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్‌లోనే నడుస్తుందట. అందుకే దీనికి 'ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు పూరీ స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తాడని టాక్ వినిపిస్తోంది.

    ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్‌ బాడీతో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకోసమే అతడు షూటింగ్‌ ప్రారంభించడానికి సమయం కావాలని కోరాడని టాక్. పూరీ జగన్నాథ్ గతంలో టెంపర్ సినిమాలో తారక్‌, ఇజం కోసం కల్యాణ్ రామ్, ఇస్మార్ట్ శంకర్‌లో రామ్‌ను సిక్స్ ప్యాక్‌తో చూపించాడు. ఇప్పుడు విజయ్ కూడా వారి బాటలోనే నడుస్తున్నాడని అంటున్నారు. ఇదే జరిగితే క్రేజీ హీరో ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.

    English summary
    Vijay Devarakonda’s career graph skyrocketed with Arjun Reddy. The film was a massive success and he went on to become the hottest star in Tollywood. According to the latest buzz doing rounds, veteran filmmaker Puri Jagannath is planning to make a film with Vijay Devarakonda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X