డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక డ్రగ్.. దీనమ్మ అంటూ హీరో రామ్ ట్వీట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరబాదీ అనేది ట్యాగ్ లైన్. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్సుగా నటించిన ఈ మూవీని శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావడంతో... రామ్‌తో పాటు చిత్ర బృందం తొలి కాపీనీ వీక్షించారు. సినిమా చూసిన అనంతరం రామ్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర కామెంట్ చేశారు. పూరి ఒక డ్రగ్ అంటూ వ్యాఖ్యానించారు.

'దీనమ్మ కిక్కు... ఇస్మార్ట్ శంకర్ పాత్ర చేస్తున్నపుడు మంచి కిక్ ఇచ్చింది. ఆ పాత్రను ఇపుడు తెరపై చూస్తుంటే ఆ కిక్కు మరింత హై రేంజిలో ఉంది. ఇలాంటి సినిమా నాకు అందించిన పూరి గారికి థాంక్స్. చాలా మంది రియలైజ్ కాని విషయం ఏమిటంటే... పూరి ఒక డ్రగ్' అంటూ రామ్ ట్వీట్ చేశారు.
రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











