ఆ పార్ట్‌పై దొంగచూపులు , ఆరోజు నన్ను స్టేజ్‌పైనే ... ఆర్జీవీ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

హీరోయిన్లు సినిమాలలో బికినీ వేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందాల ఆరబోతకు ఇంతకి మించిన మార్గం లేదంటున్నారు ముద్ధుగుమ్మలు. కానీ బికినీ వేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, దీనికి ఎంతో కష్టపడాలని కొందరు అమ్మాయిలు చెబుతారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు తేజస్వి మదివాడ. రీసెంట్‌గా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె హీరోయిన్ల వస్త్రధారణపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తేజస్వి మదివాడ .. 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌లో మెరిశారు. ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన మహేశ్ - వెంకటేష్‌ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత కజిన్‌గా అలరించారు. తర్వాత మనం, హార్ట్ అటాక్ వంటి సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో మెరిసింది తేజస్వి. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్ మూవీ ద్వారా తొలిసారిగా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అందాల ఆరబోత చేసినా ఆమెకు పెద్దగా వర్కవుట్ కాలేదు.

Acrtress Tejaswi Madivada made sensational comments on wearing bikini

తర్వాత లవర్స్, అనుక్షణం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, సుబ్రమణ్యం ఫర్ సేల్, శ్రీమంతుడు, జత కలిసే, కృష్ణాష్టమి, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, జాంబీ రెడ్డి, కమిట్‌మెంట్ వంటి సినిమాల్లో నటించింది. సినిమాలే కాదు బిగ్‌బాస్‌లోనూ తేజస్వి అలరించింది. బిగ్‌బాస్ తెలుగు 2లో ఆరు వారాల పాటు హౌస్‌లో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ తర్వాత గుర్తింపు దక్కినా అవకాశాలు మాత్రం ఈ స్థాయిలో అందుకోలేదు తేజస్వి మదివాడ.

లాంగ్ గ్యాప్ తర్వాత కమిట్‌మెంట్‌ మూవీలో కనిపించింది తేజస్వి మదివాడ. ఈ సినిమాలో కమిట్‌మెంట్ గురించి బోల్డ్‌గా డిస్కస్ చేయగా.. ఇది కాస్తా వివాదంగా మారింది. అలాగే టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్‌కు ఒప్పుకోవాలని , వాటిని తాను ఫేస్ చేశానని తేజస్వి ఓపెన్‌గా చెప్పింది.

తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ అర్ధమైందా అరుణ్ కుమార్. సిద్ధు పవన్, హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ కీలకపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 31న ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తేజస్వి మదివాడ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్ల క్రితం తాను షార్ట్‌లు వేసుకున్నానని .. రామ్ గోపాల్ వర్మ సినిమా అని అది ఇది అంటూ కొందరు మీడియా ప్రతినిధులు తిట్టారని ఆమె వ్యాఖ్యానించారు.

Prabhas Net Worth : కల్కి తర్వాత ప్రభాస్ ఆస్తుల విలువ ఎంత? ఎన్ని కోట్ల విలువైన సంపద అంటే?

కానీ ఇప్పుడు అర్ధమైందా అరుణ్ కుమార్ కోసం బికినీ వేసుకున్నానని .. ఇప్పుడు ఎలాంటి మాటలు అంటారో అంటూ తేజస్వి అన్నారు. బికినీ వేయడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నానని.. ముందు స్ట్రాంగ్ బాడీ ఉండాలని, ఆ బాడీ కోసం ఆరు నెలల పాటు కష్టపడ్డానని ఆమె చెప్పారు. ఇంతలో ఓ మీడియా ప్రతినిధి సినిమాలోని ఏదో సీన్ కోసం అడగ్గా.. నువ్వు బికినీ గురించే అడగాలని అనుకుంటున్నావు కదా ఈ డొంక తిరుగుడు ఎందుకు అని చురకలంటించింది తేజస్వి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X