వాళ్ల వల్లే మా అమ్మ చనిపోయింది.. నటి హేమ భావోద్వేగం..

Actress Hema: తెలుగు సినీ పరిశ్రమలో నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఏ విషయాన్ని అయినా నేరుగా చెప్పేస్తుంది. ఓపెన్ గా మాట్లాడుతుంది. దర్శకులు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ఒక రేవ్ పార్టీ కేసులో హేమ పేరు రావడం, అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు ఆమె జీవితాన్ని పూర్తిగా కలవరపరిచాయి. ఈ కేసు చివరకు బెంగళూరు హైకోర్టు వరకు వెళ్లగా, తాజాగా ఆ కోర్టు హేమని నిర్దోషిగా ప్రకటించి కేసును కొట్టివేసింది. కోర్టు జడ్జిమెంట్ కాపీ అందుకున్న వెంటనే హేమ ఒక భావోద్వేగ వీడియో విడుదల చేశారు. ఇంతకీ ఏమన్నారంటే ?

గతేడాది ఒక రేవ్ పార్టీ దాడిలో హేమ దొరికినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. ఆ వార్తలు పెద్ద సంచలనమై పలు మీడియా హౌజులు, సోషల్ మీడియా అకౌంట్లు హేమపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్ చేశారు. నేను దోషి కాదని ఆమె ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమెపై వచ్చిన అపోహల కారణంగా కుటుంబం, కెరీర్, ఆరోగ్యం అన్నీ దెబ్బతిన్నాయి. ఈ కేసు చివరకు బెంగళూరు హైకోర్టు వరకు వెళ్లగా, తాజాగా ఆ కోర్టు హేమని నిర్దోషిగా ప్రకటించి కేసును కొట్టివేసింది. కోర్టు జడ్జిమెంట్ కాపీ అందుకున్న వెంటనే హేమ ఓ వీడియోను విడుదల చేసింది.

Actress Hema Gets Clean Chit in Rave Party Case Releases Emotional Video Targeting Fake News and Trolls

ఆ వీడియోలో హేమ మాట్లాడుతూ.. "నేను నిర్దోషిని అని కోర్టు స్పష్టం చేసింది. నా మీద ఉన్న కేసు నవంబర్ 3న క్వాష్ అయింది. కానీ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కాపీ రాగానే మీ అందరికీ తెలియజేస్తున్నాను. నన్ను తప్పుగా ఆరోపించారు. ఎన్నిసార్లు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పినా నమ్మలేదు." అని పేర్కొన్నారు. హేమ తన తల్లి గురించి మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో నా మీద వచ్చిన అపవాదుల వల్ల మా అమ్మ ఎంతో బాధపడ్డారు. ఆ బాధతో చనిపోయారు. ఇక ఆమెను ఎవరు తీసుకొస్తారు? నాపై దుష్ప్రచారం చేసిన వాళ్లు మా అమ్మను బ్రతికిస్తారా?" అని కన్నీళ్లతో ప్రశ్నించారు.హేమ తెలిపిన ప్రకారం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ వారి కుటుంబాలను ఎంతగా దెబ్బతీస్తాయో ఎవ్వరూ గుర్తించడం లేదని విమర్శించారు.

హేమ ఇంకా మాట్లాడుతూ "ఒక వార్తను కవరింగ్ చేసేందుకు కొందరు మీడియా వ్యక్తులు ఎంత కిందకి వెళ్లారో ఆలోచించండి. నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికాననీ, బిర్యానీ పోస్టు పెడితే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ అని, బుకాయిస్తున్న హేమ, తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న హేమ అంటూ హెడ్డింగ్స్ పెట్టి వార్తలు వేశారు. ఎన్నో విధాలుగా నన్ను ట్రోల్స్ చేశారు. నేను ఏ తప్పూ చేయలేదు. నేను ఎందుకు ఈ ట్రోల్స్ అనుభవించాలి?" అని వాపోయారు.ఆ వీడియో వల్ల తాను శారీరక, మానసికంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నరకం అనుభవించానని తెలిపింది.

ఈ కేసు కారణంగా తాను దర్శకులు, హీరోలకు ఫోన్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడిందని హేమ వెల్లడించారు. "నన్ను ఏమనుకుంటారో అని ఒకటిన్నర సంవత్సరాలుగా నాలో నేనే క్రుంగిపోతున్నాను. నా ఆరోగ్యం క్షీణించింది. మా అమ్మ బాధతో చనిపోయారు. నా కెరీర్ కూడా ప్రభావితం అయింది." అని హేమ తనభాధను వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తనకు న్యాయం చేసినప్పటికీ, తనను పరువు తీసిందీ, ట్రోల్స్ చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హేమ స్పష్టం చేశారు.

"ఇప్పుడు నన్ను తప్పుగా చూపించిన వాళ్లు ఏం చేస్తారు? నా పరువును తిరిగి తెస్తారా? నా అమ్మను తిరిగి తీసుకొస్తారా? ఇకపై ఎవ్వరినీ వదలదు. నన్ను బాధపెట్టిన వారందరికీ గుణపాఠం చెప్తాను" అని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Read more about: puri jagannadh actress hema hema
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X