కమిట్మెంట్స్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారా? బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ ..
బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజ (Actress Himaja) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తర్వాత సినిమాలు, బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. సీరియల్స్‌లో నటిగా కెరీర్ ప్రారంభించిన హిమజ.. తరువాత చిత్రలహరి, వినయ విధేయ రామ, స్పైడర్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమజ. అయితే ఆమె కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లినది మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. ఈ హౌస్‌లో ఆమె డేరింగ్, డాషింగ్ యాటిట్యూడ్‌తో "ఫైర్ బ్రాండ్" పేరును సొంతం చేసుకుంది. టైటిల్ గెలుచుకోకపోయినా, షో తరువాత కూడా ఉన్నత స్థాయి గుర్తింపు మరియు విశేష ఫాలోయింగ్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల హిమజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ.. బిగ్ బాస్ లో కమిట్‌మెంట్, ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా హిమజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బాస్‌కు వెళ్లడం వల్ల కెరీర్ దిగజారుతుందనే ప్రచారంపై ప్రశ్నించగా హిమజ వెంటనే స్పందిస్తూ.. ఆ ప్రచారంలో నిజం లేదు. నాకు బిగ్ బాస్ కారణంగానే అవకాశాలు పెరిగాయి. షో పూర్తయ్యాక నేను ఎన్నో ప్రమోషన్స్ చేశాను. మాల్స్ ఓపెనింగ్‌లు, పెద్ద ఈవెంట్స్. అందుకు చాలా పెద్ద మొత్తంలో అమౌంటు ఇచ్చేవారు. అలా అవకాశాలు రావడానికి కారణం బిగ్ బాస్సే. బిగ్ బాస్ నాకు పేరు మాత్రమే కాదు, మంచి ఆదాయాన్ని కూడా ఇచ్చింది" అని చెప్పారు. అదే సమయంలో "కొంతమందికి బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఆఫర్స్ కావాలని ఉండకపోవచ్చు, అవి తమకు సరిపోవని భావించి రిజెక్ట్ చేసి ఉండొచ్చు. అందుకే 'బిగ్ బాస్ వల్ల అవకాశాలు తగ్గుతాయి' అని చెబుతుంటారు" అని హిమజ వివరణ ఇచ్చారు.

కొంతకాలంగా సోషల్ మీడియాలో బిగ్ బాస్‌లో "కమిట్మెంట్స్" ఉంటాయన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై హిమజ చాలా స్పష్టంగా, కఠినంగా స్పందించారు. 'ఈ మధ్య కమిట్మెంట్స్ అనే పదానికి చాలా వంకర అర్థాలు పెడుతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో అలాంటి అంశాలకు ఎక్కడా స్థానం లేదు. అక్కడే కాదు, ఇంటర్వ్యూల సమయంలో కూడా అలాంటి సందర్భాలు రావు. అలాగే బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యారంటే.. వారందరూ ఓపెన్ మైండెడ్.. ఫేస్ టు ఫేస్ మాట్లాడేవారు. అలాంటి వారు మాత్రమే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి వారితో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎందుకు పెట్టుకుంటుంది. అలాంటి దారుణాలకు అక్కడ చోటు లేదు బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వడానికి మూడు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఒక్క దశలో కూడా అలాంటి మాటలు వినలేదు. నేను మాత్రమే కాదు.. నా ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ ఇంటర్వ్యూలకు వెళ్లారు. వాళ్లెవరూ కూడా అలాంటి అనుభవం ఫేస్ చేయలేదు'అని హిమజ స్పష్టంచేశారు.
Bigg Boss 9 Telugu 13th Week Voting: ఓటింగ్‌లో అనూహ్య పరిణామం.. రీతూకు ఎదురుదెబ్బ.. ఈ వారం ఎలిమినేట్ ఎవరు?
ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయంటే.. కమిట్మెంట్స్ ఇచ్చి ఉంటుంది అనే రూమర్స్ వస్తున్నాయి కదా మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు హిమజా సమాధానం ఇస్తూ.. "ఒక అమ్మాయికి ఆఫర్స్ వస్తే కమిట్మెంట్స్ ఇచ్చిందంటారు... కానీ ఆఫర్స్ రాకపోతే? అప్పుడు కమిట్మెంట్స్ ఇవ్వలేదా? ఈ లాజిక్ అసలు అర్థం కాదు. కమిట్మెంట్స్ ఇస్తే స్టార్ అయిపోతారంటే ఇప్పటికి ఎన్నో అమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ అయ్యేవారు కదా! మనుషులేనా.. ఇలాంటి కామెంట్స్ చేస్తే నవ్వు కూడా వస్తుంది, కోపం కూడా వస్తుంది" అని వెల్లడించారు.
తన కుటుంబంలో ఉన్న అమ్మాయిలకు అలాంటి పదాలు వాడతారా? అనే ప్రశ్నతో హిమజ సమాజంపై ప్రశ్నలు లేవనెత్తారు. 'ఇలాంటి దురుద్దేశపూర్వక ఆరోపణలు చేయడం ఆపాలి. నిజంగా ఏదైనా జరుగుతుంటే ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదు? సాక్ష్యాలుంటే బయటకు తీయాలి, లేకపోతే ఇతరుల కెరీర్‌కి మచ్చలు పడేలా అబద్ధాలు చెప్పొద్దు'అని స్పష్టం చేశారు.
'పనీపాటలేని వారే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తారు' ఇలాంటి ఆధారంలేని ఆరోపణలను ఖండిస్తూ హిమజ చివరగా అన్నారు. 'ఇండస్ట్రీ గురించి అసలు అవగాహనలేని, పనీపాటలేని వారు మాత్రమే ఇలాంటి 'కమిట్మెంట్స్' రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఈ రూమర్స్‌లో నిజం లేదు. ఇలాంటి విషయాలను ప్రచారం చేయడం కూడా తప్పు' అని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో హిమజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ఆమె స్పష్టతతో ఇండస్ట్రీలోని అపోహలకు చెక్ పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ అభిమానులు కూడా ఆమె అభిప్రాయాలను సపోర్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











