నీ సైజు ఎంతో చెప్పు.. నెటిజన్‌కు స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై

సినీ సెలబ్రిటీలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో, హీరోయిన్‌ను ఒక్కసారి అయినా దగ్గరగా చూడాలని, మాట్లాడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినిమా ఈవెంట్స్ అయినా, మాల్ ఓపెనింగ్స్ అయినా, లేదా సోషల్ మీడియాలో లైవ్ సెషన్స్ అయినా ఎక్కడైనా వారిపై ప్రేమ, క్రేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ అభిమానమే అతిగా మారి అసౌకర్యానికి దారితీస్తుంది. ప్రత్యక్షంగా కలిసే సమయంలో కొంతమంది అభిమానులు సెల్ఫీలు కోసం హడావుడి చేయడం, దగ్గరకు రావడం, తాకేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు కనిపిస్తుంటాయి.

ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత ప్రశ్నలు అడిగి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే ఓ హీరోయిన్ అభిమానులతో లైవ్ చాట్‌లో పాల్గొంటుండగా, ఒక నెటిజన్ అనుచితంగా "మీ సైజ్ ఎంత?" అంటూ ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు ఆమె అస్సలు దిగులుపడకుండా, చురుకైన సమాధానంతో ఆ నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అసలు ఏమైంది?

Adah Sharma Strong Reply to Vulgar Question Goes Viral on Social Media

ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. అదా శర్మ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, తన గ్లామర్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రధాన హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, సైడ్ హీరోయిన్ గా కూడా ప్రధాన పాత్రల్లో నటించింది.

అయితే, అదా శర్మ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి, ఆమెకు నేషనల్ లెవెల్‌లో గుర్తింపును తెచ్చింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీంతో బాలీవుడ్‌లో కూడా ఆమెకు వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది. సినీ ప్రపంచంలో తన అందం, టాలెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదా శర్మ మరోసారి వార్తల్లో నిలిచింది.

సోషల్ మీడియాలో అదా శర్మ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫిట్‌నెస్ వీడియోలు, యోగా క్లిప్స్, డాన్స్ రీల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తన ఫాలోవర్లతో నేరుగా ఇంటరాక్ట్ కావడానికి తరచూ AMA (Ask Me Anything) సెషన్లు నిర్వహించడం ఆమె ప్రత్యేకతగా మారింది. ఇటీవల నిర్వహించిన ఒక AMA సెషన్‌లో, ఒక నెటిజన్ అసభ్యకరంగా "మీ సైజు ఏమిటి?" అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వెంటనే గ్రహించిన అదా శర్మ, "సైజు 9... నా చెప్పుల సైజు" అంటూ తన చెప్పును చూపించి షాకింగ్ రిప్లై ఇవ్వడం ద్వారా ఆ నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ స్మార్ట్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది సెలబ్రిటీలు ప్రశ్నను పట్టించుకోకుండా దాటవేస్తారు. కానీ, అదా శర్మ మాత్రం హ్యూమర్‌తో పాటు కాన్ఫిడెన్స్‌తో స్పందించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సెల్ఫ్ రెస్పెక్ట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'ఇదే రియల్ క్లాస్ రిప్లై', 'ఇలా సమాధానం చెప్పాలి' అంటూ సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు వెల్లువెత్తుతోంది.

ప్రస్తుతం అదా శర్మ 'సూపర్ వెల్లి' అనే సినిమాలో నటిస్తోంది. రాజేష్ బచ్చాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X