యూరప్‌లో హీట్ వేవ్‌తో సెగలు... బికినీలో అలా సేదతీరుతున్న టాలీవుడ్‌ హీరోయిన్!

చల్లదనానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్‌గా నిలిచే ఐరోపా ఖండాన్ని హీట్ వేవ్స్ వణికిస్తున్నాయి. విపరీతమైన ఎండలకు తోడు, వేడిగాలులతో యూరప్ ప్రజలు చెటమలు కక్కుతున్నారు. అనేక దేశాలలో ప్రమాదకర స్థితిని దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం.. గతంలో ఇలాంటి పరిస్ధితులు ఎప్పుడూ కనిపించకపోవడంతో వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. వేడి గాలుల కారణంగా యూరప్‌లో 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పరిస్ధితిని తెలియజేస్తోంది.

Also Read
ఆ హీరోయిన్‌తో బ్రేకప్? నటితో రిలేషన్‌పై అలా తేల్చేసిన మెగా హీరో!
ఆ హీరోయిన్‌తో బ్రేకప్? నటితో రిలేషన్‌పై అలా తేల్చేసిన మెగా హీరో!

యూకే, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలలో పరిస్ధితులు దారుణంగా ఉన్నాయి. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. సంపన్నులు తమ కుటుంబాలతో చల్లని ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ కూడా ఫ్యామిలీతో కలిసి బీచ్‌లో సేద తీరుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

Amy Jackson Escapes Europe Heatwave with Family Getaway to Turkey Beach Photos Go Viral

బ్రిటన్‌కు చెందిన తొలుత మోడలింగ్‌లోకి దిగారు. మిస్ టీన్ లివర్‌పూల్, మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ కాంటెస్ట్‌లలో విజయం సాధించారు. 2009లో మిస్ టీన్ వరల్డ్ కాంటెస్ట్‌లోనూ కిరీటం దక్కించుకున్నారు. అనంతరం మిస్ లివర్‌పూల్ (2010), మిస్ ఇంగ్లాండ్ (2010)లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె అందాలను చూసిన భారతీయ మేకర్స్ అమీ జాక్సన్‌కు కబురుపెట్టారు. తొలుత ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళంలో ఆర్య హీరోగా నటించిన మద్రాస్ పట్టణం సినిమా ద్వారా అమీ జాక్సన్ భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

Recommended For You
ఎన్టీఆర్‌తో మూవీ.. మా ఇంట్లో అలాంటి గొడవ.. 23 ఏళ్లకి బయటపెట్టిన రాజమౌళి
ఎన్టీఆర్‌తో మూవీ.. మా ఇంట్లో అలాంటి గొడవ.. 23 ఏళ్లకి బయటపెట్టిన రాజమౌళి

తెలుగులో ఎవడు, అభినేత్రి అనే సినిమాలో నటించగా.. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఐ (తెలుగులో మనోహరుడు) సినిమా అమీ జాక్సన్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత రోబో 2.0, క్రాక్, మిషన్ చాప్టర్ 1 సినిమాలలో ఆమె నటించారు. హిందీలో ఏక్ దీవానా షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ప్రేమాయణం సాగించిన అమీ జాక్సన్ 2012లో ఆయనతో బ్రేకప్ చెప్పారు. అనంతరం వ్యాపారవేత్త జార్జ్ పనయోటుతో కొన్నాళ్లు డేటింగ్ చేయగా.. ఆయన కారణంగా మగబిడ్డ ఆండ్రియాస్ పనయోటుకు జన్మనిచ్చారు.

You May Also Like
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’
'అతనంటే పిచ్చి... నా కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు’

జార్జ్‌తో జాంబియాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత త్వరలో పెళ్లి అనగా 2021లో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడ్డ అమీ జాక్సన్ ఆయనతో 2024లో నిశ్చితార్ధం చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కంపానియాలో ఎడ్ వెస్ట్‌విక్ - అమీ జాక్సన్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ఆస్కార్ అలెగ్జాండర్ అనే కుమారుడు సంతానం. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన భర్త, పిల్లలతో కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు అమీ జాక్సన్. ప్రస్తుతం యూరప్‌లో ఎండల నేపథ్యంలో తన భర్త, పిల్లలను తీసుకుని టర్కీలోని బోడ్రూమ్ బీచ్‌‌కు ట్రిప్ వేశారు. వైట్ కలర్ బికినీ ధరించి బీచ్‌లో సేద తీరుతున్న ఫోటోలను అమీ జాక్సన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఇద్దరు పిల్లలకు తల్లయినా అమీ జాక్సన్ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదని కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X