ఎన్టీఆర్‌తో మూవీ.. మా ఇంట్లో అలాంటి గొడవ.. 23 ఏళ్లకి బయటపెట్టిన రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా గతిని, చరిత్రను మార్చిన వ్యక్తి. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే భ్రమల్ని తుడిపేసి.. పాన్ ఇండియా కల్చర్‌కు శ్రీకారం చుట్టి హిందీ ఇండస్ట్రీ పునాదుల్ని కదిలించారు రాజమౌళి. బాహుబలి, బాహుబలి 1, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు జక్కన్న. ప్రస్తుతం మహేశ్ బాబుతో వారణాసి మూవీతో పాన్ వరల్డ్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అపజయం అనేది ఎరుగని అతికొద్ది మంది దర్శకుల్లో రాజమౌళి కూడా ఒకరు. ప్రతి సినిమాకు వచ్చే అంచనాలను అందుకుంటూ కొత్త లెక్కలు సెట్ చేయడం రాజమౌళి స్టైల్. 25 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను టాలీవుడ్‌కు అందించారు దర్శకధీరుడు. నాటి నుంచి నేటి వరకు రాజమౌళి ఎందరో స్టార్ హీరోలతో పనిచేశారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్‌తో అనుబంధం ప్రత్యేకం.

తన కెరీర్ ప్రారంభమైంది.. ఎక్కువ సినిమాలు చేసింది ఎన్టీఆర్‌తోనే. వీరిద్దరి కాంబోలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చాయి. వీటిలో వేటికవే ప్రత్యేకం. అయితే సింహద్రి సినిమా మాత్రం ఓ స్పెషల్. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో పాటు ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాలోని ఓ సీన్ కోసం ఏకంగా తన కుటుంబంతో గొడవపడ్డారట. ఈ విషయాన్ని రాజమౌళి దాదాపు 23 ఏళ్ల తర్వాత బయటపెట్టారు.
ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్‌తో పాటు ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలు, ఇంటరాక్షన్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే పలు అంతర్జాతీయ వేదికలు, సదస్సులు, సమావేశాల్లోనూ పాల్గొని వారణాసిని ప్రమోట్ చేస్తున్నారు జక్కన్న. దీనిలో భాగంగా ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి.. సినిమా మేకింగ్, కథనం, కథ చెప్పే విషయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి కుటుంబ సభ్యులు, క్రియేటివ్ టీమ్‌తో గొడవల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా రెండో సినిమా సింహాద్రిలో ఓ సన్నివేశంలో మంచి వ్యక్తిని హీరో చంపాల్సి ఉంటుంది.. అది సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన సన్నివేశం. దీనిని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే దానిపై కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్‌తో చర్చించగా.. ఒక హీరోతో ఇలాంటి సీన్ చేయిస్తే ప్రేక్షకులు అంగీకరించరని కరాకండీగా చెప్పేశారు. కానీ తాను మాత్రం ఈ సీన్ సినిమాకు ప్రాణమని విశ్వసించి అనుకున్న విధంగానే షూట్ చేశారట. మళ్లీ ఎడిటింగ్ సమయంలోనూ ఈ సన్నివేశాన్ని ఉంచాలా? తొలగించాలా అనే అంశంపై కుటుంబ సభ్యులు, క్రియేటివ్ టీమ్‌తో చిన్నపాటి వాదనలు జరిగాయి. తాను అనుకున్నట్లుగానే ఈ సీన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి సింహాద్రి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. దర్శకుడిగా కొన్నిసార్లు కఠినంగానే ఉండాల్సి ఉంటుంది.. కథపై నమ్మకం ఉన్నప్పుడు రిస్క్‌లు తీసుకోవడానికి వెనుకాడకూడదని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


