గుంటూరులో కొడితే ఇండియావ్యాప్తంగా రీసౌండ్.. అనన్య పాండే జోష్ స్పీచ్
సంచలన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవుతున్నది. పూరీ, చార్మీ, కరణ్ జోహర్ తదితరులు నిర్మించిన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషనల్ భాగంగా లైగర్ ప్రీ రిలీజ్ వేడుకను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పూరీ, చార్మీ, విజయ్ దేవరకొండ, విష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనన్య పాండే మాట్లాడుతూ..

నమస్కారం గుంటూరు. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు అనన్య పాండే. నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. గుంటూరుకు రావడానికి ముందు పూరీ జగన్నాథ్ ఏం చెప్పారంటే.. గుంటూరు బోల్ కే ఏక్ షహర్ హై.. యా హా మారేతో ఇండియామే రీసౌండ్ హోతా (గుంటూరు అనే పట్టణం ఉంది. ఇక్కడ కొడితే ఇండియా వ్యాప్తంగా రీసౌండ్ వస్తుంది) అని అన్నారు.
లైగర్ టీమ్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి టీమ్ నాకు దొరకడం ఇంకా సంతోషంగా ఉంది. పూరీ, చార్మీ, విష్, రౌడీ విజయ్ దేవరకొండ నాకు బాగా సపోర్ట్ చేశారు. లైగర్ సక్సెస్ తర్వాత మళ్లీ గుంటూరుకు వస్తాను. అప్పుడు కుమ్మేసుకొందాం అని అనన్య పాండే అన్నారు.


Click it and Unblock the Notifications











