అనన్య పాండేతో అసభ్య ప్రవర్తన.. పబ్లిక్‌గా హీరోయిన్‌ని అక్కడ టచ్ చేస్తూ..

సినీతారలు పబ్లిక్‌లోకి రావాలంటేనే భయపడిపోతున్నారు. అభిమానులు, ఆకతాయిల అత్యుత్సాహం కారణంగా హీరోయిన్లు వణికిపోతున్నారు. ఇక తోటి నటీనటులు కూడా వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వేదికల మీద అసభ్యంగా తాకడం, వేధింపులు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పట్ల బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే బాధితురాలిగా మారారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’

హిందీ నటుడు చుంకీ పాండే కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి షార్ట్ గ్యాప్‌లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, డ్రీమ్ గర్ల్ 2, గెహరియాన్, కహో గయే హమ్ కహన్, సీటీఆర్ఎల్, కాల్ మీ బే, కేసరి చాప్టర్ 2 తదితర సినిమాలతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది చాంద్ మేరా దిల్ మూవీతో ప్రేక్షకులను అలరించారు అనన్య పాండే.

Ananya Pandey Feels Uncomfortable After Gaurav Guptas Gesture At fashion show

సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, బ్రేకప్స్‌తోనే ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. పలువురు స్టార్ హీరోలతో ప్రేమాయణం, ఆ వెంటనే బ్రేకప్‌తో షాకిస్తుంటారు. బట్టలు మార్చినంత ఈజీగా ప్రియులను మార్చేస్తుందని ఆమెపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతుంటారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటారు అనన్య పాండే. తొలుత వ్యాపారావేత్త కరణ్ జైసింగ్‌తో ప్రేమాయణం సాగించిన ఆమె ఆయనతో బ్రేకప్ చెప్పేసింది.

Recommended For You
శోభిత వదినకి ఎలాంటి చీర కొంటున్నారు? నాగచైతన్య సమాధానం ఇదే!
శోభిత వదినకి ఎలాంటి చీర కొంటున్నారు? నాగచైతన్య సమాధానం ఇదే!

అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు కార్తీక్ ఆర్యన్, ఇషాన్ ఖట్టర్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో కొంతకాలం డేటింగ్ చేసింది. ప్రస్తుతం అమెరికన్ మోడల్, అటవీ జంతువుల కోసం పోరాడుతున్న వాకర్ బ్లాంకోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా బీటౌన్ మీడియా చెబుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలో వాకర్‌ను పరిచం చేసింది అనన్య పాండే. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వంతారా యానిమల్ పార్క్‌లో వాకర్ పనిచేస్తున్నారు.

You May Also Like
'నా శరీరంపై అక్కడ తాకుతూ పైశాచిక ఆనందం.. అలా బుద్ధి చెప్పా’
'నా శరీరంపై అక్కడ తాకుతూ పైశాచిక ఆనందం.. అలా బుద్ధి చెప్పా’

ఇదిలాఉండగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటంతో పాటు లేటెస్ట్ ఫ్యాషన్ పట్ల ఇంట్రెస్ట్ చూపుతారు అనన్య. దేశ, విదేశాల్లో జరిగే పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని ర్యాంప్ వాక్‌తో హల్‌చల్ చేస్తుంటారు అనన్య పాండే. తాజాగా ముంబైలో జరిగిన సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు ఈ ముద్దుగుమ్మ. క్రిస్టల్‌తో తయారు చేసిన వైట్ కలర్ బ్రైడల్ లెహంగాలో కనువిందు చేశారు అనన్య. అయితే ర్యాంప్ వాక్ ముగిసిన అనంతరం గౌరవ్ గుప్తాతో కలిసి వేదిక మీద ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో గౌరవ్ గుప్తా హద్దుమీరి ప్రవర్తించాడు. అనన్య నడుముపై చేతులు వేసి తడుముతూ గిల్లాడు. దాంతో ఆమె కూడా అసౌకర్యానికి గురైంది. ఆ వెంటనే తేరుకుని అతని నుంచి పక్కకి తప్పుకుని గౌరవ్‌ని నవ్వుతూ అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు గౌరవ్ గుప్తాపై మండిపడుతున్నారు. అటు సభా మర్యాదని కాపాడుతూ సమయస్పూర్తిగా వ్యవహరించిన అనన్య పాండేపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more about: ananya pandey movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X