‘ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
రేఖ వేదవ్యాస్.. ఈ జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. అదే ఆనందం రేఖ అంటే ఎవరైనా సరే వెంటనే గుర్తుపడతారు. తన అందం, నటన, చిరునవ్వుతో అప్పట్లో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అందం, జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, మన్మథుడు తదితర సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతారని అనుకుంటున్న దశలో అనూహ్యంగా టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత కన్నడంలో కొన్ని సినిమాలు చేసిన రేఖ .. అనంతరం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. 2014 నుంచి దాదాపు 10 ఏళ్లపాటు ఇంటికే పరిమితమైంది. 2023లో అలా ఇలా ఎలా, 2024లో ఒరు థీ అనే తమిళ చిత్రాల ద్వారా రేఖ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్స్ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రేఖ మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
రేఖ గురించి తెలుసా అంటే ఎవరికీ గుర్తురాదు.. కానీ ఆనందం రేఖ అంటే వెంటనే గుర్తుపడతారు. నిజానికి ఆనందం మూవీ ఉదయ్ కిరణ్ గారు హీరోయిన్‌గా చేయాలి. స్క్రీన్ టెస్ట్ చేసినప్పుడు ఉదయ్ కిరణ్ తదితరులను పిక్ చేసుకుని టీమ్ మొత్తం రామోజీ ఫిలింసిటీకి కూడా వచ్చారు. కానీ ఏం జరిగిందో కానీ ఉదయ్ ప్లేస్‌లో ఆకాష్ గారు హీరోగా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమాలోని ఓ సాంగ్‌ని ఊటీలో తీశాం. అప్పటికే చలి వణికిస్తోంది, అలాంటిది రెయిన్ సెటప్‌లో ఓ షాట్ తీశారు. కట్ అనగానే వెంటనే చలిమంట కాచుకోవడానికి పరిగెత్తుకుని వెళ్లి దుప్పటి కప్పుకునే దానిని. తర్వాత మళ్లీ షాట్‌కి సిద్ధమయ్యేదానిని అని రేఖ తెలిపారు.

కెరీర్‌లో నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌కి రుణపడి ఉంటాను. దాని వల్లే ఆర్టిస్ట్‌గా గుర్తింపు, డబ్బు వచ్చింది. నేను చేసిన సినిమాలు ఫ్లాప్ కావొచ్చు, హిట్ కావొచ్చు కానీ నన్ను సెలెక్ట్ చేసిన మేకర్స్‌కి థ్యాంక్స్. ఉదయ్ కిరణ్‌తో బాండింగ్ గురించి చెబుతూ... ఉదయ్ గారితో వరుసగా రెండు మూడు సినిమాలు మిస్ అయ్యాయి. కలుసుకోవాలని సినిమాలో హీరోయిన్‌గా నేనే చేయాల్సింది. ఆ టైంలో నేనొక కన్నడ మూవీ చేస్తుండటంతో డేట్స్ క్లాష్ అయిపోయి వాళ్లు వెయిట్ చేయలేకపోయారు. ఉదయ్ కిరణ్ గారితో పెద్దగా పరిచయం లేదు, ఇండస్ట్రీలో ఎవరితోనూ కనెక్షన్స్ లేవని రేఖ వెల్లడించారు.
హీరోయిన్ గజాలా గారికి మీకు గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి దీనిపై మీ స్పందన ఏంటీ అని వర్ష అడగ్గా.. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను, నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకెవరితోనూ గొడవలు పెట్టుకోవడం నచ్చదు, నాకు ఇగో లేదు. జనానికి ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారు అనే న్యూస్ పెడితే వాళ్లకి నచ్చుతుంది కదా? ఇదంతా కొన్ని పీఆర్ టీమ్‌లు చేసే పని తప్పించి నాకు ఎవ్వరితోనూ ఎలాంటి ప్రాబ్లమ్ లేదని రేఖ వేదవ్యాస్ స్పష్టం చేశారు.
పెళ్లి ఎప్పుడు అనే దానిపై మాట్లాడుతూ.. ఇండియాలో నేను, సల్మాన్ ఖాన్‌గారు సింగిల్‌గా మిగిలిపోతామేమో. మంచి అబ్బాయి దొరకడం లేదు.. నేనేం చేయాలి. నన్ను చూడగానే ఎవరో ఒకరు ఉంటారులే అనుకుంటారు. ఈ కన్‌ఫ్యూజన్‌లో నేను సింగిల్‌గా మిగిలిపోయా. కాబోయే భర్త ఎలా ఉండాలనే ఆలోచన ఒక టైంలో ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు నా జీవితంలోకి వచ్చేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలని 100 పాయింట్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం నిజాయితీగా ఉండాలి, నన్ను బాగా ప్రేమించాలి. నన్ను ఇష్టపడితే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసెజ్ చేయండి అంటూ రేఖ సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


