అంతా పూరీ జగన్నాథ్ వల్లనే.. నాగార్జున కూడా కారణమే.. అనుష్క
vసినిమాల్లో నటించాలనే కోరిక పెద్దగా లేదు. నా అంతట నేను ఇండస్ట్రీలోకి రాలేదు. సూపర్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ జగన్నాథ్.. కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారని తెలిసింది. నేను వెళ్లి కలిశాను. దాంతో సూపర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది అని అనుష్క అన్నారు.

నటించాలనే కోరిక నాకు లేదు
సినిమాల్లో నటించాలనే కోరిక పెద్దగా లేదు. నా అంతట నేను ఇండస్ట్రీలోకి రాలేదు. సూపర్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ జగన్నాథ్.. కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారని తెలిసింది. నేను వెళ్లి కలిశాను. దాంతో సూపర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది అని అనుష్క అన్నారు.
అలా 14 ఏళ్లు పూర్తయింది
అలా మార్చి 13న మొదలైన నా సినీ ప్రయాణం నేటికి 14 ఏళ్లు పూర్తయింది. నా కోసం సమయం కేటాయించి మంచి కథలు రాసి.. నా జీవితాన్ని మార్చేసిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. ముఖ్యంగా నాగార్జున, పూరీ జగన్నాథ్, నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు రుణపడి ఉంటాను అని అనుష్క చెప్పింది.

సైలెన్స్ మూవీలో అనుష్క
భాగమతి లాంటి భారీ హిట్ తర్వాత అనుష్క ప్రస్తుతం సైలెన్స్ అనే చిత్రంలో నటిస్తున్నది. హేమంత్ మధుకర్ దర్శకుడు. మాటల రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రధాన భాగం అమెరికాలో జరుగనున్నది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

ప్రభాస్‌తో అఫైర్.. మ్యారేజ్ గురించి
ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌తో పెళ్లి అనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అనుష్క మాత్రం దానిపై పెద్దగా స్పందించలేదు. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల మిర్చి చైనాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వారిద్దరూ కలిసి అక్కడికి వెళ్లడం వారి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది.


Click it and Unblock the Notifications











