పూరి జగన్నాథ్‌ని అంత మాట అనేసిన అనుష్క.. లైగర్ సినిమాపై స్వీటీ రియాక్షన్ ఇదే..!

దేశంలో ఎక్కడ చూసినా లైగర్ హంగామా కనిపిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమాను అంతలా ప్రమోట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు. హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య పాండే దేశాన్ని చుట్టేస్తూ లైగర్ పై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్నారు. ఇంతలో చిత్ర రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో పలువురు నటీనటులు చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అనుష్క ఏమంది? ఆ సందేశం ఎందుకు వైరల్ అవుతుందో చూద్దామా..

అనుష్క క్రేజ్.. తొలి అడుగు అక్కడే

అనుష్క క్రేజ్.. తొలి అడుగు అక్కడే

ఈ రోజు అనుష్క సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అయిందంటే దానికి కారణం పూరి జగన్నాథ్. ఈ డాషింగ్ డైరెక్టర్ ముంబై వెళ్లి మరీ అనుష్కను హైదరాబాద్ తీసుకొచ్చారు. స్వీటీగా పూరికి పరిచయమైన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అయింది.

పూరిపై అనుష్క ఫీలింగ్స్..

పూరిపై అనుష్క ఫీలింగ్స్..

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ సినిమాతో పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడమే గాక స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అయింది అనుష్క. యోగ టీచర్ గా పనిచేసే ఆమెను కెమెరా ముందుకు తీసుకొచ్చి స్టార్ హీరోయిన్ చేశారు డాషింగ్ డైరెక్టర్. అలా నాగార్జున సరసన తొలి సినిమా చేసి ఇండస్ట్రీ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన స్వీటీకి పూరితో ఉన్న అనుబంధం ఎలాంటిది అనేది తాజా మెసేజ్‌తో స్పష్టమైంది.

ఏకంగా ఆ మాటతో అంతా షాక్.. అనుష్క తీరు చూస్తే

ఏకంగా ఆ మాటతో అంతా షాక్.. అనుష్క తీరు చూస్తే

పడి లేచిన కెరటం పూరి జగన్నాథ్‌. అయితే ఆయన్ను ముద్దుగా ఇండస్ట్రీలోని చాలామంది జగన్, పూరి అని అంటుంటారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా పూరి జగన్నాథ్‌కు కొత్త పేరు పెట్టేసింది. లైగర్ సినిమా విడుదలకు ముందు తన బెస్ట్ విషెస్ అందిస్తూ పూరి జగన్నాథ్‌ని 'జగ్గు దాదా' అని సంబోధించింది. ఇప్పటిదాకా ఆయన్ను అలా పిలిచినా వారు లేరు. దీంతో ఈ పేరు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

 అనుష్క అనే పేరు నామకరణం.. పూరి పాత్ర

అనుష్క అనే పేరు నామకరణం.. పూరి పాత్ర

అనుష్క అసలు పేరు స్వీటీ. సూపర్ సినిమా కోసం ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నపుడు ఆమె పాస్‌పోర్ట్‌లో కూడా అదే పేరు ఉందట. దీంతో ఇది నిక్ నేమ్‌‌లా ఉందని భావించి పూరి జగన్నాథ్, నాగార్జున కలిసి అనుష్క అనే పేరు పెట్టేశారట. అలా పెట్టిన ఈ పేరు దాదాపు దశాబ్దానికి పైగా తెలుగు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించింది.

దేశవ్యాప్తంగా లైగర్ ట్రెండ్

దేశవ్యాప్తంగా లైగర్ ట్రెండ్

ఇకపోతే పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో లైగర్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. చిత్రంలో విజయ్- అనన్య రొమాంటిక్ డోస్ పీక్స్‌లో ఉండనుందని ఇప్పటికే విడుదల చేసిన అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X