7 ఏళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత లైఫ్ పూర్తి మారిపోయింది.. అవికా షాకింగ్ స్టేట్‌మెంట్!
యంగ్ హీరోయిన్ అవికా గోర్ (Avika Gor)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. 'చిన్నారి పెళ్లికూతురు (Balika Vadhu)' సీరియల్‌తో చిన్నతనంలోనే స్టార్‌డమ్ అందుకున్న అవికా, ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వరుసగా పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తాజాగా 'అగ్లీ స్టోరీ' (Ugly Story) అనే సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. Karuppu Day 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద కరుప్పు వసూళ్ల వేట..సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?
తన జీవితంలో అన్ని విషయాలు చాలా వేగంగా జరిగిపోయాయని అవికా వెల్లడించింది. "ఏడు సంవత్సరాల వయసులోనే నేను 'బాలికా వధు' సీరియల్‌లో నటించడం మొదలుపెట్టాను. 15 ఏళ్లకే హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ప్రేమ, పెళ్లి ఇలా నేను అనుకున్న దానికంటే చాలా త్వరగా నా జీవితంలో జరిగిపోయాయి' అని ఆమె తెలిపింది. ఈ ప్రయాణం తనకు ఒకవైపు ఆనందాన్ని ఇచ్చినా, మరోవైపు ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోయిన భావన కలిగిస్తోందని చెప్పింది.

ముఖ్యంగా, తాను ఇప్పటివరకు తనకు నచ్చిన డ్రీమ్ రోల్‌లో నటించే అవకాశం రాలేదని చెప్పడం గమనార్హం. "ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల్లో నాకు పూర్తిగా తృప్తి కలిగించే డ్రీమ్ రోల్ చేయలేకపోయాను. అదే నా జీవితంలో ఒక చిన్న బాధగా మిగిలిపోయింది" అని ఆమె చెప్పింది. ఇక తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, అవికా తన ప్రేమ కథను కూడా పంచుకుంది. 2025 సెప్టెంబర్ 30న ముంబైలో తన ప్రియుడు, మాజీ రోడీస్ కంటెస్టెంట్ మిలింద్ చంద్వానీని ఆమె వివాహం చేసుకుంది. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, చివరకు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని తెలిపింది.
"మాది లవ్ మ్యారేజ్. మొదట్లో మా పేరెంట్స్ కొంచెం సందేహపడ్డారు. కానీ తర్వాత మమ్మల్ని అర్థం చేసుకుని మా పెళ్లికి ఒప్పుకున్నారు" అని ఆమె వెల్లడించింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు, "నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం" అని చెప్పింది. ప్రస్తుతం చాలా మంది జంటలు విడిపోతున్న నేపథ్యంలో ఈ ప్రశ్న రావడం సహజమని అంగీకరించిన అవికా, తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించింది.
"నేను జెన్ జీ జనరేషన్‌కు చెందినదాన్నే అయినా, నా ఆలోచనలు మాత్రం సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఇప్పటికీ నేను లవ్ లెటర్స్‌ను నమ్ముతాను. ఒకరికొకరు నమ్మకం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అదే రిలేషన్‌ను నిలబెడుతుంది" అని ఆమె పేర్కొంది. తమిద్దరి కెరీర్‌లు వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ, ఒకరినొకరు గౌరవిస్తూ, అర్థం చేసుకుంటూ జీవితం సాగిస్తున్నామని చెప్పింది. అలాగే పెళ్లి తర్వాత తన జీవితంలో కొన్ని మార్పులు వచ్చినట్టు కూడా అవికా వెల్లడించింది. "పెళ్లి తర్వాత నా జీవితంలో కొన్ని విషయాలు మారాయి. కానీ ఆ మార్పులు పాజిటివ్‌గా ఉన్నాయి" అని చెప్పింది.


Click it and Unblock the Notifications


