గ్లామర్ డోసు పెంచేసిన అవికా గోర్... లిక్కర్ షాపులో మత్తెక్కించేలా అందాల విందు!

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు అవికా గోర్. ఈ సీరియల్ ఘన విజయం సాధించంతో చిన్న వయసులోనే ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత ససురాల్ సిమర్ కా, లాడో వీర్పూర్ కి మర్దని తదితర సీరియల్స్‌లో నటించింది అవిక. ఈ సీరియల్స్ హిందీ నుంచి దేశంలోని కొన్ని ప్రాంతీయ భాషల్లోకి డబ్ అయి అక్కడా మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించింది. పెరిగి పెద్దయిన తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి గుర్తుండిపోయే విజయాలు సాధించింది అవికా గోర్.

Also Read
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?

చిన్నారి పెళ్లికూతురిని హీరోయిన్‌ని చేసిన ఘనత టాలీవుడ్‌దే. తెలుగు గడ్డపై నుంచే ఆమె హీరోయిన్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. 2013లో రాజ్ తరుణ్‌కి జంటగా ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ వెంటనే లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థ్యాంక్యూ, పాప్‌కార్నర్, ఉమాపతి, షణ్ముఖ వంటి వంటి తెలుగు సినిమాలలో నటించారు. హీరోయిన్‌గానే కాకుండా పాప్‌కార్న్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. సినిమాలు చేస్తున్నప్పటికీ సీరియల్స్‌ను మాత్రం ఆమె విడిచిపెట్టలేదు.

Recommended For You
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్

అయితే హీరోయిన్‌గా అనుకున్న స్థాయిలో అవికా గోర్ సక్సెస్ కాలేదు. చిన్నా చితకా హీరోలు తప్పించి బడా హీరోల పక్కన నటించే అవకాశం ఆమెకు దక్కలేదు. ఇటీవల తెలుగులో వచ్చిన అగ్లీ స్టోరీపై గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇక అవిక వ్యక్తిగత జీవితానికి వస్తే... మిళింద్ చద్వానీ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దాదాపు 7 ఏళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో గతేడాది సెప్టెంబర్ 30న అవికా- మిళింద్‌లు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.

Avika Gor was spotted in Mumbai She made elegant appearance in Trendy wear Here is photos

ఇటీవల అవికా గోర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ను వదిలేసి బ్యాంకాక్‌లో స్థిరపడుతున్నట్లు ప్రకటించారు. తన భర్త వ్యాపారం, విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవికా వెల్లడించారు. బ్యాంకాక్‌లో స్థిరపడినప్పటికీ సినీ రంగాన్ని మాత్రం వదిలిపెట్టనని ఆమె స్పష్టం చేశారు. షూటింగ్స్ నిమిత్తం ముంబై, హైదరాబాద్‌‌కు నిత్యం ప్రయాణించిన అనుభవం ఉండటంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అప్పట్లో ఆమె నిర్ణయం పట్ల అభిమానులు సినీ ప్రముఖులు షాక్ అయ్యారు.

You May Also Like
రామ్ చరణ్ మరో ఘనత.. కోహ్లీని వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌లో.. ప్రభాస్, ఎన్టీఆర్ ర్యాంక్ ఎంత?
రామ్ చరణ్ మరో ఘనత.. కోహ్లీని వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌లో.. ప్రభాస్, ఎన్టీఆర్ ర్యాంక్ ఎంత?

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అవికా గోర్.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లని రెచ్చగొడుతుంటారు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూటో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ముంబైలో దిగిన అవికా గోర్.. నగరంలోని రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఆ వెంటనే ఓ బార్ సెటప్ బ్యాక్‌డ్రాప్‌లో ఎద అందాలు కనిపించేలా షర్ట్ బటన్స్ తీసేసి ఫోటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి కాస్తా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. అవికా అందాలపై ఓ లుక్ వేయండి.

Read more about: avika gor movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X