పదహారేళ్ల వయసులోని అమాయకత్వం.. నాటి జ్ఞాపకాల్లో ఛార్మీ
తెలుగు తెరపై ఎంతో త్వరగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మంత్ర2 వంటి సినిమాలతో హిట్లు కొట్టింది. అయితే హీరోయిన్‌గా లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఛార్మీ జ్యోతి లక్ష్మీ సినిమాతో మళ్లీ అదరగొట్టింది. కానీ ఛార్మీ మాత్రం హీరోయిన్‌గా కంటిన్యూ అవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. నిర్మాతగా మారి పూరి జగన్నాద్ చిత్రాల్లో భాగస్వామిగా చేరింది.
అప్పటి నుంచి పూరి కనెక్ట్స్ బ్యానర్‌కు అన్నీ తానై నడిపిస్తోంది. చివరగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చాలా కాలం తరువాత నిర్మాతగా అసలు సిసలైన విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఛార్మీ ప్యాన్ ఇండియన్ చిత్రాల బాధ్యతను తీసుకుంది. విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో వస్తోన్న ఫైటర్ చిత్రీకరణలో బిజీగా ఉంది. తాజాగా ఛార్మీ తన పాత ఫోటోలను షేర్ చేసింది. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.

పదహారేళ్ల వయసులో ఉన్న ఛార్మీ తన ఫోటోలను షేర్ చేస్తూ.. 'ప్రస్తుతం ఆ అమాయకమైన మనస్తత్వం, హృదయాన్ని చూస్తుంటే... కేవలం పని కోసం పడుకుని నిద్ర లేచే దాన్ని అనిపిస్తోంది. కానీ నేను ఎప్పుడూ అలాంటి దాన్ని కాదు. ప్యూర్ 16లోని అమాయకత్వం మళ్లీ తిరిగి రాదు. అవి ఎంతో మధురమైన క్షణాలు' అని నాటి విషయాలను గుర్తు చేసుకుంది. ఆ మధ్య ఫైటర్ సినిమాపై వచ్చిన రూమర్లను ఖండిస్తూ.. స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











