వాడు నా మీదకు దూకి.. భుజాలపై చేతులు వేసి, గట్టిగా ఓ ముద్దు పెట్టేశాడు.. ఛార్మీ కామెంట్స్

హీరోయిన్‌గా, నిర్మాతగా ఛార్మీ ఫుల్ ఫామ్‌లో ఉంది. బబ్లీ హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఛార్మీ స్టార్ హీరోల సరసనా నటించింది. అనుకోకుండా ఒక రోజు, మంత్ర వంటి సినిమాలతో ఛార్మీ మంచి విజయాలను అందుకుంది. ఇక పూరి గ్యాంగ్‌లో చేరిన ఛార్మీ.. అప్పటి నుంచి నిర్మాణం వైపు అడుగులు వేసింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే దగ్గరుండి చూసుకుంటోంది.

అన్నీ తానై..

అన్నీ తానై..

పూరి జగన్నాద్‌కు ప్రస్తుతం ఛార్మీ అన్నీ తానై చూసుకుంటోంది. పూరిని ఇంతకుముందుకు ఓ మేనేజర్ మోసం చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఛార్మీనే అన్ని వ్యవహారాలు చూసుకుంటోంది. సినిమాకు సంబంధించిన డబ్బు వ్యవహారాలన్నీ ఛార్మీనే చూసుకుంటోంది.

ఇస్మార్ట్ విజయంతో..

ఇస్మార్ట్ విజయంతో..

చాలా ఏళ్ల తరువాత పూరి జగన్నాద్‌కు సరైన హిట్ లభించడంతో ఇరువురు తెగ సంబరపడిపోయారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో.. ఇరువురు కొత్త కార్లను బహుమతులుగా ఇచ్చుకున్నారు. ఈ సినిమా విజయం వీరిని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ (ఫైటర్) చేసేందుకు సిద్దమయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది ఛార్మీ. సినిమాలకు, వ్యక్తిగత విషయాలు, సెట్స్‌లో జరిగే విషయాలు ఇలా ఏదో ఒకటి నిత్యం పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఛార్మీ జంతు ప్రేమికురాలు. మూగజీవాలంటే ఎంతో ఇష్టం. ఈ కారణంగా ఛార్మీ ఇంట్లో ఓ పెంపుడు కుక్క ఉంది.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
గట్టిగా ముద్దు పెట్టేశాడు..

గట్టిగా ముద్దు పెట్టేశాడు..

ఛార్మీ పెంచుకుంటున్న ఆ పెట్ పేరు మమ్మీ.. ఈ మేరకు తాజాగా ఓ పోస్ట్ చేసింది. వాడు నా అంత ఎత్తు ఉండటంతో నా మీదకు దూకి, వాడి చేతులు నా భుజాలపై వేసి.. గట్టిగా ఓ ముద్దు పెట్టేశాడు'అంటూ వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X