Disha Patani: దిశా పటానీతో డేటింగ్.. అదిరిపోయే ట్విస్ట్‌తో బాయ్ ఫ్రెండ్ క్లారిటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ, ప్రభాస్ కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి సినిమాలకన్నా వ్యక్తిగత జీవితమే చర్చకు కేంద్రంగా నిలిచింది. గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)తో బ్రేకప్ తర్వాత ఆమె సింగిల్‌గానే ఉంటున్నారని అందరూ భావించారు.కానీ, తాజాగా పంజాబీ సింగర్-రాపర్ తల్విందర్ సింగ్ (Talwinder Singh Sidhu)తో ప్రేమలో ఉందంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ సింగర్ తో ఆమె డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు షాక్ ఇచ్చాయి.
అయితే, రూమర్స్‌కు ప్రధాన కారణం ఉదయ్‌పూర్‌లో జరిగిన కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ (Nupur Sanon)వివాహ వేడుకలు. అక్కడ దిశా-తల్విందర్ ఇద్దరూ కలిసి కనిపించడమే కాకుండా, జోడీగా సందడి చేయడం, ఆ తర్వాత రిసెప్షన్‌లోనూ పక్కపక్కనే దర్శనమివ్వడంతో ఈ పుకార్లు షికారు చేశాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, దిశా కొత్త ప్రియుడు ఇతడేనంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు, ముంబైలో జరిగిన లోలాపలూజా ఇండియా 2026 మ్యూజిక్ ఫెస్టివల్‌లో వీరిద్దరూ చేతులు పట్టుకుని నడుచుకుంటూ రావడంతో 'ఇది అధికారికమేనా?' అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఈ నేపథ్యంలో తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్విందర్ సింగ్ సిద్ధూ తొలిసారి స్పందించారు. 'మేమిద్దరం పెళ్లికి కొద్దిరోజుల ముందే పరిచయమయ్యాం. ఇంత త్వరగా మాపై అందరి దృష్టి పడుతుందని అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం ఒకరినొకరం తెలుసుకునే దశలో ఉన్నాం. ఇలాంటి పుకార్ల వల్ల వచ్చే ఒత్తిడిని మేం కోరుకోవడం లేదు. మా మధ్య ఉన్నది కేవలం స్నేహమే,' అంటూ స్పష్టంగా చెప్పారు. పుకార్లను పుకార్లుగానే వదిలేయాలని కూడా వ్యాఖ్యానించారు.
అయితే ఇంటర్వ్యూ చివర్లో అడిగిన ఓ ప్రశ్నే మళ్లీ ఆసక్తిని రేపింది. 'మీకు ప్రేమపై నమ్మకం ఉందా?' అని అడగ్గా... తల్విందర్ సింగ్ నవ్వుతూ.. 'నేను ప్రతిరోజూ ప్రేమలో పడుతూనే ఉంటాను... ఇప్పుడూ ప్రేమిస్తున్నాను' అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ మాటలు దిశానీ ఉద్దేశించేవేనా అన్న చర్చ నెట్టింట మొదలైంది. ప్రస్తుతం దిశా వయసు 33 కాగా, తల్విందర్‌కు 28 ఏళ్లు- వీరిద్దరి మధ్య ఐదేళ్ల వయసు తేడా కూడా సోషల్ మీడియాలో టాపిక్‌గా మారింది.
గతంలో దిశా పటానీ ఆరు సంవత్సరాల పాటు టైగర్ శ్రాఫ్‌తో రిలేషన్‌లో ఉన్నారు. 2022లో ఇద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దిశా, టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ (Krishna Shroff)కు కూడా చాలా సన్నిహితురాలే కావడం విశేషం. ఇక సినిమాల విషయానికొస్తే... దిశా త్వరలో దర్శకుడు భరద్వాజ్ దర్శకత్వంలో 'ఓ రోమియో' (O Romeo) ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
MSVPG Day 25 Box Office Collections: మెగాస్టార్ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.. వరప్రసాద్ మూవీకి ఎన్ని కోట్లంటే
ఇంతకీ తల్విందర్ సింగ్ ఎవరు?
తల్విందర్ సింగ్ సిద్దూ యువ గాయకుడు-రాపర్. సంప్రదాయ పంజాబీ బీట్‌లను ట్రాప్, సింథ్-పాప్ మ్యూజిక్‌తో మిక్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నాడు. 1997 నవంబర్ 23న పంజాబ్‌లోని తరన్ తారణ్‌లో జన్మించిన తల్విందర్ చిన్న వయసులోనే పాటలు పాడడం మొదలుపెట్టాడు. 14 ఏళ్లకే కుటుంబంతో కలిసి అమెరికా (శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా)కి వెళ్లాడు.
అక్కడే తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించాడు. యూట్యూబ్, స్పాటిఫై, సౌండ్‌క్లౌడ్‌లలో పాటలు విడుదల చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తల్విందర్. 2022లో 'కమ్మో జీ', 'ధుంద్లా', 'ఫంక్ సాంగ్'** వంటి ట్రాక్‌లతో వైరల్ అయ్యాడు. 2024లో విడుదలైన అతని తొలి ఆల్బమ్ 'మిస్‌ఫిట్'(Misfit) కూడా మంచి స్పందన పొందింది. ప్రస్తుతం యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ సింగర్.. దిశా పటానీ తో డేటింగ్ వార్తలో లైమ్ లైట్ లోకి వచ్చారు.


Click it and Unblock the Notifications











