షూటింగ్‌లో గాయపడ్డ వరుణ్ తేజ్ హీరోయిన్.. ఏం జరిగిందంటే!

బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ సినిమా షూటింగ్‌లో గాయపడింది. మలంగ్ సినిమాలో హీరో అదిత్యరాయ్ కపూర్‌తో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలంగ్ సినిమా షూటింగ్‌లో గాయపడిన దిశాపటానీకి హస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు అని బాలీవుడ్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. గాయం తర్వాత వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. కాగా, దిశాపటానీ గాయపడటం ఇటీవల ఇది రెండోసారి.

సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రంలో పాట షూటింగ్ సందర్భంగా గాయాల పాలైంది. ఆ సందర్భంగా దిశా పటానీ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నేను బాగా కష్టపడిన పాట ఇదే. భారత్ సినిమా కోసం పాటలో కాలికి గాయమైంది. కష్టమైన స్టెప్పులు వేయడంతో కాలు బెణికింది అని తెలిపింది.

Disha Patani injured in film Malang sets

ఇక మలంగ్ సినిమా విషయానికి వస్తే.. భారీ ఫైట్స్ సీన్లలో దిశా పటానీ నటిస్తున్నది. ఈ సందర్భంగానే ఆమె గాయపడిందని తెలిసింది. మలంగ్ యాక్షన్ ప్రధాన చిత్రంగా రూపొందుతున్నది. ఈ సినిమా కోసం ఆదిత్య రాయ్ కపూర్ ప్రత్యేకంగా ఈతలో శిక్షణ పొందారు. ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కునాల్ కేము, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఇక దిశాపటానీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఎంఎస్ ధోని చిత్రంతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X