అమితాబ్, షారుక్ కంటే ఈ హీరోయిన్ బాడీగార్డుకే జీతం ఎక్కువట.. ఏడాదికి ఎన్ని కోట్ల జీతమంటే?
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు మూవీ లవర్స్ కు అటు క్రికెట్ లవర్స్ కు ఈ హీరోయిన్ గురించి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ దగ్గర పని చేసిన ఈ భామ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల బాడీగార్డ్ లకు భారీగా జీతాలు ఇస్తారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా షారుక్, అమితాబ్ ల బాడీగార్డ్ ల కంటే అనుష్క శర్మ బాడీగార్డ్ ఎక్కువ జీతం అందుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ అతని శాలరీ ఎంత? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టడానికి ముంబై వెళ్ళిన అనుష్క శర్మ 2007లో లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెకు హెయిర్ ఆయిల్, షాంపూ, ఆభరణాల యాడ్స్ కు సంబంధించిన ఆఫర్లు వచ్చాయి. 2008లో అనుష్క లో రబ్ నే బనాదీ జోడీ అనే సినిమాలో నటించింది. నిజానికి ఈ హీరోయిన్ ఆ సినిమాలో నటించడం అప్పట్లో చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కి ఏమాత్రం ఇష్టం లేదట. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం అనుష్క మీద నమ్మకంతో ఏకంగా ఒకేసారి మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఇక ఆ మూడు సినిమాల్లో ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా మిగతా రెండు యావరేజ్ గా నిలిచాయి.

Sabari Movie Review అమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మెప్పించిందా? శబరి మూవీ ఎలా ఉందంటే?
ఇదిలా ఉండగా, సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. పైగా రోజురోజుకీ ఆమె పాపులారిటీ మరింతగా పెరుగుతుంది. ఇక సాధారణంగా బాలీవుడ్ లో హీరోలు హీరోయిన్లు ఎక్కువగా ప్రేమలో పడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం బాలీవుడ్ హీరోలు అందరినీ పక్కన పెట్టింది. విరాట్ కోహ్లీపై మనసు పారేసుకుంది.

ప్రస్తుతం అనుష్క విరాట్ కోహ్లీల ఆస్తుల నికర విలువ 1300 కోట్లు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఓవైపు సినిమాలు, యాడ్స్, మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది అనుష్క. కాగా ఈ బ్యూటీ తన వ్యక్తిగత బాడీగార్డ్ ప్రకాష్ అలియాస్ సోనుకి ఏడాదికి 1.2 కోట్లు జీతంగా చెల్లిస్తున్నట్టు సమాచారం. అయితే బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొంటున్న బాడీగార్డుల్లో ప్రకాశ్ ఒకరు అని చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











