పూరీ జగన్నాథ్ ఆఫర్ రిజెక్ట్.. బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకొన్న హీరోయిన్ ఎవరంటే?
టాప్ డైరెక్టర్స్‌తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో పనిచేయాలని హీరో, హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. ఆ డైరెక్టర్స్‌తో నటించాలని ఉందని మనసులో కోరికను బయట పెడుతుంటారు. అయితే పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్‌తో నటించే ఒకే ఒక ఛాన్స్ వస్తే.. ఫేట్ మారిపోతుందని హీరోయిన్లు తహతహలాడుతుంటారు. అలాంటి డైరెక్టర్ బ్రహ్మండమైన ఆఫర్ ఇస్తే.. రిజెక్ట్ చేసిన హీరోయిన్ గురించి మీకు తెలుసా? ఆ హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే..
రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌ను కన్నడ చిత్ర పరిశ్రమలో మొదలుపెట్టింది. గిల్లీ అనే సినిమా ద్వారా కన్నడ సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో దక్షిణాదిలో ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వచ్చాయి. ఆ సమయంలోనే బిజీగా మారిపోయారు. దాంతో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అయితే మరికొన్ని అవకాశాలను వ్యక్తిగత కారణాల వల్ల మిస్ చేసుకొన్నానని చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత మరో సినిమాను పూరీ జగన్నాథ్ అట్టహాసంగా ప్రారంభించే పనిలో పడ్డారు. అదే అల్లు అర్జున్‌తో దేశముదురు. ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను అనుకొన్నారట. అయితే పూరీ జగన్నాథ్ ఇచ్చిన ఆఫర్‌ను ముందు వెనుక చూసుకోకుండా రిజెక్ట్ చేశారట. ఆ విషయాన్ని ఇటీవల ఓ మూవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పోకిరి మూవీ తర్వాత నాకు పూరీ జగన్నాథ్ ఫోన్ చేశారు. తదుపరి సినిమా కోసం 100 రోజుల కాల్షిట్ కావాలని అడిగారు. అయితే ఆ సమయంలో నాకు పరీక్షలు ఉండటంతో నేను సినిమా చేయలేనని చెప్పాను. అంతేకాకుండా నాకు తెలుగు రాదని సాకు చెప్పాను. అయితే మేము తెలుగు నేర్పిస్తామని కూడా చెప్పారు. అయినా ఆ సినిమా నేను చేయలేదు అని రకుల్ తెలిపారు.

అయితే తన ఆఫర్‌ను రిజెక్ట్ చేయడంతో పూరీ జగన్నాథ్ మా నాన్నపై సీరియస్ అయ్యారు. డిగ్రీ పరీక్షలు ఇవ్వాళ కాకపోతే రేపు రాసుకొవచ్చు. అవకాశం చేజారితే మళ్లీ వస్తుందా? డిగ్రీ పాసైతే దానిని మెడలో వేసుకొని నీ కూతురు తిరుగుతుందా? అని మా నాన్నతో అన్నారని రకుల్ చెప్పింది.
పూరి జగన్నాథ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను తీసుకొన్న నిర్ణయాల్లో ఒక తప్పుడు నిర్ణయం అని అన్నారు. అయితే మళ్లీ ఎప్పుడూ ఆ దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం రాకపోవడం తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన రకుల్‌కు ఆ కాంబినేషన్ సెట్ కాకపోవడం నిరాశను కలిగించిన విషయంగా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











