కమల్ హాసన్‌తో బ్రేకప్.. ప్రముఖ డైరెక్టర్‌తో రిలేషన్‌షిప్.. చివరకు భర్తతో నరకం చూసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఆకర్షణ కలగడం, వారి మధ్య అఫైర్లు కొనసాగడం దశాబ్దాల కాలంగా వింటూనే.. చూస్తూనే వస్తాం. ప్రేమించిన వారి కోసం కన్నవారిని వదిలేసి రావడం, ఏకంగా మతాంతర వివాహాలు చేసుకొని మతం మార్చుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో కళ్ల ముందు కదలాడాయి. అయితే స్టార్ హీరో ప్రేమలో మునిగి తేలిన ఓ నటి మతం మార్చుకొని.. పెళ్లి తర్వాత నరకం చూసింది. ఆ హీరోయిన్ వివరాల్లోకి వెళితే..
13 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా
తమిళ సినిమా పరిశ్రమలో అగ్రనటిగా రాణించిన హీరోయిన్.. చిన్నతనం నుంచి కష్టాల కడలిలో ప్రయాణించింది. కుటుంబ పోషణ కోసం 13 ఏళ్ల వయసులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చింది. ఇప్పటి వరకు సుమారుగా 700 సినిమాలకుపైగా నటించింది. కమల్ హాసన్, రజనీకాంత్, ఇతర సౌతిండియన్ స్టార్స్‌తో నటించడమే కాకుండా అందం, గ్లామర్‌తో మెప్పించింది.

కుటుంబ పోషణ కోసం నటనలోకి
ఆ హీరోయిన్ విషయానికి వస్తే.. తమిళ సినిమా పరిశ్రమలో టాప్ కమెడియన్ శ్రీకృష్ణమూర్తి, కర్నాటక క్లాసికల్ సింగ్ ఎంఎల్ వసంతకుమారి గారాల కూతురుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తన తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దాంతో పేదరికం నుంచి బయటపడటానికి నటనను వృత్తిగా స్వీకరించింది.
టాప్ హీరోతో ప్రేమలో
తమిళ సినిమా పరిశ్రమలో 1967లో తిరువారుచెల్వార్ సినిమాలో లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్‌తో కలిసి నటించడం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, కన్నడ రంగాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొన్నది. అలా హీరోయిన్‌గా సెటిల్ అయ్యే క్రమంలో టాప్ హీరోతో పనిచేస్తూ అతడి ప్రేమలో పడింది.

కమల్, రజనీతో కలిసి
ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ రూపొందించిన అపూర్వ రాగంగల్ సినిమాలో కమల్, రజనీకాంత్‌తో కలిసి నటించింది. ఆ సమయంలో ఆమె కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. అయితే కమల్‌తో ప్రేమ పెళ్లికి ఆమె తల్లి అభ్యంతరం చెప్పడంతో బ్రేకప్ జరిగిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ భరతన్‌తో ప్రేమలో పడింది. అయితే కొన్ని కారణాల వల్ల వారి రిలేషన్ షిప్‌కు బ్రేకప్ జరిగింది.
మలయాళ దర్శకుడితో పెళ్లి
కమల్, భరతన్‌తో బ్రేకప్ తర్వాత మలయాళ సినీ పరిశ్రమకు చెందిన జార్జ్ థామస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకొన్నది. ఆ పెళ్లి కోసం క్రిస్టియన్ మతాన్ని స్వీకరించింది. అయితే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో దాంపత్య జీవితం నరకంగా మారింది. అయితే తీరా గ్రహించే సరికి ఆస్తులన్నీ భర్త లాగేసుకోవడంతో ఆమె జీవితం రోడ్డుపైకి వచ్చింది. చివరకు కోర్టులో న్యాయపోరాటం చేసి ఆస్తులను దక్కించుకొనే ప్రయత్నం చేసింది.

క్యాన్సర్ వ్యాధితో
ప్రేమలో, వివాహ జీవితంలో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించింది ఎవరో కాదు.. లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్న నటి శ్రీవిద్య. జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించిన ఆమె చివరకు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ దానిని జయించలేక 2006 సంవత్సరంలో తుదిశ్వా స విడిచారు.


Click it and Unblock the Notifications











