మంచు లక్ష్మి కాళ్లపై పడ్డ అభిమాని.. బయటకు వచ్చాక అతడిని ఏం చేసిందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ల ఫ్యామిలీ నుంచి హీరోయిన్లు పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో టాలెంట్లను చూపించుకుని హైలైట్ అయ్యారు. వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ప్రసన్న ఒకరు. అందంతో పాటు అభినయంతో మెప్పిస్తోన్న ఈ భామ.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మంచు లక్ష్మిని ఓ అభిమాని తనదైన చర్చతో సర్‌ప్రైజ్ చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!
అలా మొదలైన ప్రయాణం
మంచు లక్ష్మి 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ చేసింది. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే 'లక్ష్మి టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది.

తక్కువ మూవీలతోనే క్రేజ్
మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన మంచు లక్ష్మి ప్రసన్న.. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను దక్కించుకుంది. ఈ ఉత్సాహంతోనే హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే, నిర్మాతగానూ పలు మూవీలను నిర్మించింది. ఇలా చాలా తక్కువ సినిమాలే చేసినా లక్ష్మి ప్రసన్న ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది.
ఇప్పుడలా.. ఆదిపర్వంతో
ఈ మధ్య కాలంలో లక్ష్మి ప్రసన్న లేడీ ఓరియెంటెడ్ మూవీలతో వస్తోంది. ఇలా ఇప్పుడు 'ఆదిపర్వం' అనే సినిమా చేస్తోంది. సంజీవ్ మెగోటి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అన్వికా ఆర్ట్స్, ఏవన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విజువల్ వండర్‌గా రాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఘనంగా ట్రైలర్ ఈవెంట్
మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'ఆదిపర్వం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. దీనికి మంచు లక్ష్మితో పాటు నటీనటులు, టెక్నీషియన్లు హాజరయ్యారు.
కాళ్లపై పడిన అభిమాని
తాజాగా జరిగిన 'ఆదిపర్వం' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మంచు లక్ష్మి ప్రసన్న మాట్లాడుతోన్న సమయంలో ఓ ఊహించని పరిణామం జరిగింది. తిరుపతికి చెందిన ఆమె అభిమాని నేరుగా స్టేజ్ మీదకు వచ్చి లక్ష్మి ప్రసన్న కాళ్లపై పడిపోయాడు. ఆ సమయంలో అతడు ఆనందంతో ఏడ్చేశాడు. అయితే, ఆమె మాత్రం ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
Pooja Ramachandran: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. గ్లామర్ తెర తీసేసి మరీ ఘాటు ఫోజులు
తర్వాత ఏం చేసిందంటే
ఈవెంట్‌లో తన కాళ్లపై పడిన అభిమానిని ఆ తర్వాత మంచు లక్ష్మి కలిసింది. బయటకు వచ్చిన వెంటనే అతడిని ఆప్యాయంగా పలకరిస్తూ ఓదార్చింది. అంతేకాదు, అతడితో కలిసి ఫొటోలకు సైతం ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అయితే, మంచు లక్ష్మి క్లిప్‌పై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











