‘అల్లు అర్జున్ సినిమా కోసం ఆ ఇంజెక్షన్లు తీసుకుందా?' షాకింగ్ రిప్లై ఇచ్చిన హన్సిక

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి హన్సిక మోత్వాని (Hansika). చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హన్సిక. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో తనపై వచ్చిన రూమర్స్, అలాగే తన జీవితంలో అత్యంత ఎమోషనల్‌గా అనిపించిన సినిమా షూటింగ్ గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

హన్సిక.. తెలుగు ప్రేక్షకుల దగ్గర చేసిన సినిమా దేశముదురు. అల్లు అర్జున్ హీరోగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే హన్సిక హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. కొద్దికాలంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్‌ల జాబితాలో చోటు సంపాదించారు.

Hansika Gives Shocking Reply to Injection Rumours During Allu Arjun Desamuduru Movie

అయితే 'దేశముదురు' సినిమా సమయంలో హన్సికపై ఒక పెద్ద రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఆమె వయసు తక్కువగా ఉండగానే హీరోయిన్‌గా కనిపించేందుకు గ్రోతింగ్ హార్మోన్స్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్‌పై తాజాగా హీరోయిన్ హన్సిక స్పందించారు. ఆ రూమార్స్ ను పూర్తిగా ఖండించారు. 'మీడియా అటెన్షన్ కోసం చాలా సార్లు లేని విషయాలు కూడా సృష్టిస్తారు. నాకు ఇంజెక్షన్స్ అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం. ఇప్పటికీ ఇంజెక్షన్ వేయించుకునే సమయంలో ఏడుస్తూనే ఉంటాను. అలాంటిది నేను గ్రోతింగ్ హార్మోన్స్ తీసుకున్నానని చెప్పడం పూర్తిగా అబద్ధం'అని క్లారిటీ ఇచ్చారు.

ఆ సమయంలో తన వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని, అదే కారణంగా ఇలాంటి అనవసర ప్రచారాలు జరుగుతున్నాయని హన్సిక చెప్పారు. తాను సహజంగానే పెరిగానని, కష్టపడి అవకాశాలు సంపాదించుకున్నానని చెప్పారు. ఈ క్లారిటీతో ఎన్నేళ్లుగా వస్తున్న ఆ రూమర్‌కు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో 'దేశముదురు' సినిమా షూటింగ్‌కు సంబంధించిన జ్ఞాపకాలను హన్సిక ఎంతో భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. "నా కెరీర్‌లో షూటింగ్ పూర్తయ్యాక కన్నీళ్లు పెట్టుకున్న ఒకే ఒక్క సినిమా 'దేశముదురు' మాత్రమే" అని అన్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ తర్వాత యూనిట్ సభ్యులు తమ పనుల్లోకి వెళ్తారు. కానీ ఆ సినిమా యూనిట్ మాత్రం ఒక కుటుంబం మారిపోయిందని ఆమె చెప్పింది.

షూటింగ్ ఎక్కువ భాగం మనాలీలో గుర్తుంది, అక్కడ అందరూ కలిసి చాలా సరదాగా గడిపేవాళ్లమని హన్సిక చేసుకున్నారు. "డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, ఆయన భార్య, మా అమ్మ, అల్లు అర్జున్ గారు.. అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. ఆ సెట్ ఒక కుటుంబంలా అనిపించేది" అని చెప్పారు. షూటింగ్ రోజు ముగిసిన అందరికీ వీడ్కోలు చెబుతుంటే తనకు కన్నీళ్లు ఆగలేదని అన్నారు.

ఇక అల్లు అర్జున్ గురించి కూడా హన్సిక ప్రత్యేకంగా మాట్లాడారు. "ఆయన చాలా మంచి వ్యక్తి. ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. నేను అప్పట్లో చాలా చిన్న వయసులో ఉన్నాను. అది గుర్తుంచుకుని నన్ను ఎంతో కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చూసేవారు. షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు నేర్పించారు. సినిమా సెట్స్‌లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్న విషయాల్లో నాకు గైడ్‌లా ఉండేవారు' అని కొనియాడారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X